Tandoori chicken ice cream : తందూరి చికెన్ ఐస్ క్రీం .. తింటే ఏమవుతుందో?

వేసవికాలంలో ఐస్ క్రీమ్ తినడానికి ఇష్టపడే వారికి సరికొత్త కాంబినేషన్ వచ్చింది. అదే 'తందూరి చికెన్ ఐస్ క్రీమ్'. ఇదేం కాంబినేషన్ బాబోయ్ అంటారా? ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో తయారు చేసిన ఐస్ క్రీమ్ వైరల్ అవుతోంది.

Tandoori chicken ice cream

Tandoori chicken ice cream :  నార్మల్‌ గానే ఐస్‌ క్రీమ్ అంటే ఇష్టపడని వారు ఉండరు. ఇక వేసవికాలంలో ఐస్‌ క్రీమ్ కప్పులు కప్పులు లాగించేసేవారు ఉంటారు. అయితే ఇప్పుడు చెప్పబోయే ఐస్‌ క్రీమ్ మాత్రం తినగలరో లేదో మీరే డిసైడ్ చేసుకోవాలి మరి.

Ghost Husband : దెయ్యం భర్త నుంచి విడాకులు కోరుతున్న భార్య.. వైరల్ అవుతున్న వింత కథ

కొత్త కొత్త కాంబినేషన్లలో వెరైటీ ఫుడ్స్ తయారు చేయడం ఇప్పుడు సర్వసాధారణమే. ఆ కాంబినేషన్స్ ఒక్కోసారి హిట్.. ఒక్కోసారి ఘోరంగా ఫెయిలవుతున్నాయి. తాజాగా ఓ రకం ఐస్ క్రీమ్ పేరు వినడానికి.. చూడటానికి అదోలా ఉంది.. ఇంక తినేవారి పరిస్థితి ఏమో? అదే ‘తందూరి చికెన్ ఐస్ క్రీం’ (Tandoori chicken ice cream). దీనిని ఎలా తయారు చేస్తారో తెలిపే వీడియోతో పాటు ఈ ఐస్‌ క్రీమ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరికీ ప్రోటీన్‌తో (protein) నిండి ఉన్న ఐస్ క్రీమ్‌ అనే శీర్షికతో ఈ వీడియోని Mohammed Futurewala అనే వ్యక్తి షేర్ చేయడం మరీ విడ్డూరంగా అనిపిస్తోంది. చికెన్‌తో ఐస్ క్రీమ్ రోల్స్ ఎలా తయారు చేసాడో ఈ వీడియోలో చూపించారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.

good thieves : దొంగిలించిన నగదు తిరిగిచ్చేసి పోలీసులకు షాక్ ఇచ్చిన దొంగలు.. వింత సంఘటన వైరల్

ఇక ఈ వీడియో చూసినవారు ఐస్‌ క్రీమ్ మీద విరక్తి కలుగుతోందని కొందరు.. ఈ వింత కాంబినేషన్ ఏంటని మరికొందరు కామెంట్లు పెడుతున్నారు. ఇక వైరల్ అవ్వాలనే కోరికతో ఇలాంటి కాంబినేషన్లు తమపై ప్రయోగించవద్దని ఇవి తమ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాయో అని ఫుడ్ లవర్స్ ఆందోళన చెందుతున్నారు.