Millionaires Pleading: పన్ను విధించమంటూ 102 మంది మిలీయనర్ల విజ్ఞప్తి

తమకు ఇప్పుడే పన్ను విధించమని 100మందికి పైగా మిలీయనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. సంపన్న వ్యక్తులు, లాభాపేక్షలేని వారు పాల్గొన్న అధ్యయనంలో షాకింగ్ సంచలన విషయం బయటికొచ్చింది.

Millionaires Pleading: తమకు ఇప్పుడే పన్ను విధించమని 100మందికి పైగా మిలీయనర్లు విజ్ఞప్తి చేస్తున్నారు. సంపన్న వ్యక్తులు, లాభాపేక్షలేని వారు పాల్గొన్న అధ్యయనంలో షాకింగ్ సంచలన విషయం బయటికొచ్చింది. ప్రపంచంలోని అత్యంత సంపన్నులపై సంపద పన్ను విధిస్తే.. సంవత్సరానికి $2.5 ట్రిలియన్ల వరకూ పెరుగుతుందని తెలియడంతో స్వతహాగా విజ్ఞప్తి చేస్తూ ముందుకొచ్చారు.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఆన్‌లైన్ దావోస్ సమావేశానికి రాసిన బహిరంగ లేఖలో డిస్నీ సంస్థకు చెందిన అబిగైల్ డిస్నీతో సహా 102 మంది మిలియనీర్లు లేఖ ద్వారా విజ్ఞప్తి చేశారు. ట్యాక్స్ ద్వారా వచ్చిన డబ్బుతో ప్రతి ఒక్కరికీ కోవిడ్ వ్యాక్సిన్‌ను వేసేందుకు ఆర్థికంగా నిలదొక్కుకోగలమని అంటున్నారు. అంతేకాకుండా 2.3 బిలియన్ల మంది ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకురావొచ్చనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.

“ప్రస్తుత పన్ను విధానం అన్యాయంగా ఉంది. ధనవంతులను మరింత ధనవంతులను చేయడానికి ఉద్దేశపూర్వకంగా రూపొందించినట్లుగా ఉంది. ప్రపంచంలోని ప్రతి దేశంలో ఉన్న ధనికులు తమ వాటాను న్యాయపూర్వకంగా చెల్లించాలి. అందుకే ధనవంతులపై ట్యాక్స్ విధించండి’ అని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: జైల్లో చెకింగ్.. దొరక్కూడదని ఫోన్ మింగేశాడు

ప్రపంచ ఛారిటీ ఆక్స్‌ఫామ్ నివేదిక ఆధారంగా ప్రపంచంలోనే 10 మంది అత్యధిక ధనవంతులు మహమ్మారి రెండేళ్ల కాలంలో 1.5ట్రిలియన్ డాలర్లు రెట్టింపు అయింది.

మిలీయనర్లుగా ప్రస్తుత పన్ను విధానం సరిగా లేదని అర్థమైంది. హ్యూమానిటీ, ట్యాక్స్ మీ నౌ, ఆక్స్‌ఫాం గ్రూపులు పన్ను విధించాలంటూ లేఖలో పేర్కొన్నారు.
US, కెనడా, జర్మనీ, UK, డెన్మార్క్, నార్వే, ఆస్ట్రియా, నెదర్లాండ్స్, ఇరాన్‌ దేశాలకు చెందిన వారంతా ఇదే మాటపై ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు