Tihar Jail: జైల్లో చెకింగ్.. దొరక్కూడదని ఫోన్ మింగేశాడు

అధికారులకు తెలియకూడదని.. ఫోన్ మింగేశాడు. కడుపులో నొప్పి రావడంతో తట్టుకోలేక బయటకు చెప్పి అడ్డంగా బుక్కయ్యాడు. జైలు అధికారులు చెకింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో మింగేసిన ఫోన్..

Tihar Jail: జైల్లో చెకింగ్.. దొరక్కూడదని ఫోన్ మింగేశాడు

Tihar Jail: అధికారులకు తెలియకూడదని.. ఫోన్ మింగేశాడు. కడుపులో నొప్పి రావడంతో తట్టుకోలేక బయటకు చెప్పి అడ్డంగా బుక్కయ్యాడు. జైలు అధికారులు చెకింగ్ డ్రైవ్ నిర్వహిస్తున్న సమయంలో మింగేసిన ఫోన్ ను.. జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ కడుపులో నుంచి ఎండోస్కోపీ ద్వారా బయటకు తీశారు.

జనవరి 5న ఖైదీ ఉండే గదిలో చెకింగ్ జరుగుతుండగా ఫోన్ మింగేశానని ఆ తర్వాత అధికారుల ముందు మొరపెట్టుకున్నాడు. డీడీయూ హాస్పిటల్ కు తీసుకెళ్లి.. వారం రోజుల పాటు అడ్మిట్ చేయించి 7సెంటిమీటర్ల ఫోన్ ను బయటకు తీశారు.

గతేడాది తీహార్ జైలు పరిసరాల్లో మొబైల్ ఫోన్స్ సిగ్నల్ అందకుండా మూడు మొబైల్ జామర్లను ఏర్పాటు చేశారు. ఢిల్లీ పోలీస్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్ ఐదుగురి జైలు అధికారులను అరెస్టు చేసిన తర్వాత ఈ ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి : తెలంగాణలో మరోసారి జ్వర సర్వే

సుకేశ్ చంద్రశేఖర్ రూ.200 కోట్ల ఎక్స్‌టార్షన్ కేసులో ఇన్వాల్వ్ అయ్యారని తెలియడంతో అధికారులను సస్పెండ్ చేసి అరెస్టు చేశారు. ఈ విచారణలో సుకేశ్ జైలులో నుంచి ఈ రాకెట్ నడిపిస్తున్నట్లు వెల్లడైంది.