ఈ రోజుల్లో చాలామంది పొద్దున్న లేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగకపోతే ఏ పని మొదలుపెట్టలేరు. అయితే మనం ఇంట్లో చక్కగా మనకు నచ్చిన టీ పొడి వేసుకొని టీ తాగితే పర్వాలేదు కానీ.. కొంతమంది టీ బ్యాగులు ఉపయోగిస్తుంటారు. వాటివల్ల చాలా సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు.
ప్రస్తుతం జరుగుతున్న పరిశోధన ప్రకారం, చిక్కంతా టీలో లేదు.. టీ బ్యాగులోనే ఉంది. కార్పొరేట్ ఆఫీసుల్లో రిలీఫ్ కోసం కప్పుల మీద కప్పులు టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే టీలో ఎన్నిరకాలున్న టీ బ్యాగు మాత్రం ఒకటే కాబట్టి ఎలాంటి టీ తాగినా మీరు అనారోగ్యం బారిన పడక తప్పదంటున్నారు అమెరికా హెల్త్ జర్నల్ తాజా అధ్యయనంలో ప్రచురించింది.
సైంటిస్టులు చేసిన పరిశోధన ప్రకారం.. ఒక టీ బ్యాగ్ 11 బిలియన్ మైక్రో ప్లాస్టిక్ అంటే 11వందల కోట్ల మైక్రో ప్లాస్టిక్, దాంతో పాటు 3బిలియన్ నానో ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తుందని గుర్తించారు. అందుకే మార్కెట్‌లో దొరికే కాఫీ, టీ బ్యాగులను వాడకూడదని, పొడిని మాత్రమే వాడాలని వారు చెబుతున్నారు.
టీ బ్యాగులతో ఉపయోగాలు కూడా ఉన్నాయి…
గ్రీన్ లేదా బ్లాక్ టీ బ్యాగ్ ను కళ్ల వాపులు, మంటలను వచ్చినప్పుడు ఉపయోగిస్తే కళ్లకి రిలీఫ్ ను ఇస్తోంది. టీలో ఉండే యాంటీ ఇరిటెంట్ గుణాలు కళ్ల చుట్టూ ఉండే వాపును తగ్గిస్తాయి. అయితే వాడేసిన 2 టీ బ్యాగులను 30 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత కళ్ల మీద ఉంచుకోవాలి. అలా 10 నిమిషాలపాటు టీ బ్యాగులను కళ్ల మీద ఉంచుకుని తీస్తే.. కళ్ల మంటలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.