Ravi Shastri : టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్

ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. టీమిండియా కోచ్ రవిశాస్త్రికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.

Team India Headh coach Ravi Shastri positive for Corona: ఇంగ్లండ్ పర్యటనలో టీమిండియాకు పెద్ద షాక్ తగిలింది. ఓ పక్క కరోనా కొనసాగుతున్నా టీమ్ ఇండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లింది. ఓవల్ స్టేడియం వేదికగా నాలుగో టెస్టు జరుగుతున్న సమయంలో కరోనా షాక్ ఇచ్చింది. టీమిండియా హెచ్ కోచ్ రవిశాస్త్రి కి కరోనా పాజిటివ్ నిర్థారణ అయింది. దీంతో ఆయన్ని ఐసోలేషన్ లోకి పంపించాల్సి వచ్చింది. స్వల్ప అస్వస్థతకు రవిశాస్త్రి గురి కావటంతో ఆదివారం రాత్రి చేసిన కరోనా టెస్ట్ ల్లో రవిశాస్త్రికి పాజిటివ్ నిర్ధారణ అయిందని బీసీసీఐ ప్రకటించింది. రవిశాస్త్రితో పాటు ఫీల్డింగ్‌ కోచ్‌ శ్రీధర్‌, పిజియోథెరఫిస్ట్‌ నితిన్‌ పటేల్‌ ను కూడా సెల్ఫ్‌ ఐసోలేషన్‌ లోకి పంపినట్లు బీసీసీఐ ప్రకటించింది. ఇక అటు టీమిండియా ఆటగాళ్లకు అందరి కరోనా నెగిటివ్‌ రావడంతో ఇవాళ్టి మ్యాచ్‌ కు అనుమతించింది బీసీసీఐ.

మిగతా కోచ్ సిబ్బందికి ఈ రోజు మార్నింగ్ చేసిన టెస్ట్ ల్లో వచ్చే ఫలితాన్ని బట్టి.. ఓవల్ గ్రౌండ్ కి పంపే అవకాశం ఉందని బీసీసీఐ కార్యదర్శి జై షా తెలిపారు.ఇదిలా ఉంటే నాలుగో టెస్టులో టీమ్ మెంబర్స్ అందరికి కరోనా టెస్టులు చేయించారు. వారందరికి నెగిటివ్ రావటంతో నాలుగవరోజు రోజు ఆట కొనసాగింది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. ప్రస్తుతం క్రీజులో విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా ఉన్న సంగతి తెలిసిందే. రోహిత్ శర్మ సూపర్ సెంచరీకి తోడుగా.. పుజారా సూపర్ ఇన్నింగ్స్ టీమిండియాను రేస్ లో నిలబెట్టింది.

రోహిత్ తొలి విదేశీ సెంచరీ.. కోహ్లీ రియాక్షన్ ..
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి.. వైస్ కెప్టెన్ కి మధ్య విబేధాలు ఉన్నాయంటూ పలు మార్లు కథనాలు వచ్చాయి.కానీ అవన్నీ కేవలం రూమర్లేనని మరోసారి వెల్లడైంది. ఈరోజు ఇన్నింగ్స్ లో వాటికి చెక్ పెట్టేశాడు కోహ్లీ. వారిద్దరి మధ్య ఉన్న స్నేహబంధాన్ని వెల్లడైంది. ఇటువంటి రూమర్లను ఒక్క ఎక్స్‌ప్రెషన్‌తో తుడిచేశాడు కోహ్లీ. ఇంగ్లాండ్‌కు.. టీమిండియాకు ఓవల్ స్టేడియం వేదికగా నాలుగో టెస్టు మూడో రోజు సమయంలో స్టేడియంలో రోహిత్ శర్మతో పూజారా ఉన్నారు. మొయిన్ అలీ వేసిన 8.5ఓవర్ బంతికి రోహిత్ సిక్సు బాదేశాడు. అప్పటి వరకూ 94పరుగులుగా ఉన్న హిట్ మాన్ స్కోరు సెంచరీకి చేరింది. తొలి విదేశీ సెంచరీ నమోదు చేశాడని కామెంటరీలో చెప్తుండగానే కోహ్లీ లేచి చప్పట్లు కొడుతూ సంతోషాన్ని వ్యక్తపరిచాడు. దీంతో వీరిద్దరి మధ్యా ఎటువంటి విభేదాలు లేవని చెప్పకనే చెప్పాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.

ట్రెండింగ్ వార్తలు