Bangladesh: బంగ్లాదేశ్‌లో ఉగ్రదాడులు జరిగే ముప్పు: యూకే

రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలపై దాడులు జరగవచ్చని పేర్కొంది.

బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు దాడులు చేసే ముప్పు ఉందని యూకే హెచ్చరించింది. ఈ మేరకు బంగ్లాదేశ్‌కి వెళ్లిన తమ పౌరులకు సూచనలు చేసింది. విదేశీ పౌరులు తరచుగా వచ్చే ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని బంగ్లాదేశ్‌లో ఉగ్రవాదులు దాడులు చేసే అవకాశం ఉందని తెలిపింది.

రద్దీగా ఉండే ప్రాంతాలు, మతపరమైన భవనాలు, రాజకీయ ర్యాలీలపై దాడులు జరగవచ్చని పేర్కొంది. ఇస్లాం మతానికి విరుద్ధమైన అభిప్రాయాలు, జీవనశైలిని కలిగి ఉన్న వ్యక్తులను కూడా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని చెప్పింది.

ఇప్పటికే మైనారిటీ మత వర్గాలపై కొందరు దాడులు జరుపుతున్నారని, అలాగే, పోలీసులు, భద్రతా బలగాలను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయని తెలిపింది. ప్రధాన నగరాల్లో ఇంప్రూవైజ్డ్ ఎక్స్‌ప్లోజివ్ డివైస్ (ఐఈడీ) దాడులు కూడా జరుగుతున్నాయని పేర్కొంది.

ప్లాన్ ప్రకారం జరపాలనుకుంటున్న దాడులను అడ్డుకునేందుకు బంగ్లాదేశ్ అధికారులు పనిచేస్తూనే ఉన్నారని తెలిపింది. బంగ్లాదేశ్‌లోని యూకే పౌరులు స్థానిక అధికారుల సూచనలను పాటించాలని పేర్కొంది.

తెలుగు రాష్ట్రాల్లో స్పల్ప భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన జనం