Vice President Kamala Harris
Vice President Kamala Harris: వైస్ ప్రెసిడెంట్ కమలా హ్యారీస్ ఇంటి ముందు ఓ వ్యక్తి ఆయుధంతో దొరికిపోయాడు. టెక్సాస్ కు చెందిన వ్యక్తిని బుధవారం అరెస్టు చేసినట్లుగా వాషింగ్టన్ డీసీ పోలీసులు వెల్లడించారు. అక్కడి సమయం ప్రకారం.. మధ్యాహ్నం 12గంటల 12నిమిషాలకు మస్సాచుసెట్స్ ఎవెన్యూలోని 3400బ్లాక్ అనుమానస్పదంగా తిరుగుతున్న వ్యక్తిని గుర్తించారు.
ఇంటిలిజెన్స్ వర్గాలు అలర్ట్ అయి సమాచారం ఇవ్వడంతో యూఎస్ సీక్రెట్ సర్వీస్ అతణ్ని అక్కడినుంచి తప్పించారు. అనుమానితుడు పాల్ ముర్రే (31) ముందుగా తనకేం తెలియదని చెప్పినా.. అతని వెహికల్ నుంచి రైఫిల్, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ప్రస్తుతం అతనిపై పలు సెక్షన్ల ప్రకారం కేసు ఫైల్ అయింది. రైఫిల్ లేదా షార్ట్ గన్ సందర్భం లేకుండా పట్టుకు తిరగడం నేరం, దాంతో పాటు గుర్తు తెలియని అమ్యూనిషన్ ను వెహికల్ నుంచి స్వాధీనం చేసుకున్నారు. యూఎస్ సీక్రెట్ సర్వీస్ చెప్పిన దానిని బట్టి అఫీషియల్ డ్రెస్ లో ఉన్న మెట్రోపాలిటన్ పోలీస్ అధికారులే ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.