30 రోజులు కుక్క ఫుడ్ తినడమే అతని ఛాలెంజ్

  • Published By: veegamteam ,Published On : January 27, 2020 / 05:43 AM IST
30 రోజులు కుక్క ఫుడ్ తినడమే అతని ఛాలెంజ్

Updated On : January 27, 2020 / 5:43 AM IST

టెక్సాస్ లోని ఓ వ్యక్తి కుక్క ఆహారాన్ని మాత్రమే 30 రోజుల నుంచి తింటున్నాడు. కుక్క ఆహారాన్ని తినడం ఎందుకు.. అనేదేగా మీ సందేహం!! ఆ పుడ్ ఎందుకు తీసుకుంటున్నాడంటే..

టెక్సాస్ లోని మెయిన్ స్టర్ లో కుక్కల ఆహారాన్ని తయారు చేసే మిల్లింగ్ కంపెనీ యజమాని మిచ్ ఫెల్డరాఫ్. సాధారణంగా కుక్కలను పెంచుకునే యజమానులు తమ కుక్కలకు ఇచ్చే పుడ్ మంచిదా కదా అని కస్టమర్లు ఆరా తీస్తారాని మిచ్ ఓ ప్రకటనలో తెలిపాడు.

అందుకే తమ కంపెనీలో తయారైన పుడ్.. చాలా మంచిదని తెలియజేయటం కోసం తానే 30 రోజుల కుక్క పుడ్ తినాలని ఛాలెంజ్ తీసుకున్నాడు. దాంతో తమ పుడ్ నాణ్యత గురించి కస్టమర్లకు నమ్మకం కలుగుతుందని అనుకుంటున్నట్లు తెలిపాడు.

జనవరి నెలారంభంలో డాగ్ పుడ్ తినడం ప్రారంభించినప్పటి నుంచి మిచ్ 20 పౌండ్ల(9 కిలోల) బరువు తగ్గినట్లు చెప్పాడు. ఆ పుడ్ తీసుకోవటం వల్ల చాలా ఎనర్జీ వచ్చినట్లుగా ఉందని మిచ్ తెలిపాడు. ప్రస్తుతం డాగ్ పుడ్ తింటున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ మారాయి.