Dog Or Giraffe : వామ్మో.. ఇది కుక్కనా? జిరాఫీనా..? ఎంత పొడవుందో…

thats-not-a-dog-thats-a-giraffe

Dog Or Giraffe : ఇప్పుడో కుక్క సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. దాని పొడువు చూసి అంతా విస్తుపోతున్నారు. వామ్మో.. అని నోరెళ్లబెడుతున్నారు. ఎంత పొడవుంది.. అని ముక్కున వేలేసుకుంటున్నారు విస్తుపోతున్నారు. ఎరిస్.. అనే శునకం ఇప్పుడు సోషల్ మీడియాలో అందరిని అట్రాక్ట్ చేస్తోంది. ఇది కుక్కనా? లేక జిరాఫీనా? అని అనే అనుమానం కలుగుతోంది. అంత పొడవుంది ఆ కుక్క.

ఎరిస్ తెలుపు రంగులో ఉంది. టాన్ బొర్జాయ్ జాతికి చెందినది. ఫైవ్ ఫీట్ ఉంది. పొడవు ఏడు ఇంచులు ఉంది. ఈ కుక్క తన రెండు కాళ్లపై నిల్చుంటే.. అచ్చం జిరాఫీ అంత పొడవు ఉంటుంది. దీని యజమాని ఇంటి గేటుని చాలా ఎత్తుగా కట్టించాడు. తన పెంపుడు కుక్క గేటు దూకి బయటకు వెళ్లకుండా చాలా ఎత్తులో గేటుని నిర్మించాడు. ఎరిస్ ఫొటోలను దాని యజమాని సోషల్ మీడియాలో షేర్ చేశాడు. అంతే, ఒక్కసారిగా వైరల్ అయ్యింది. ఇది కుక్క కాదు జిరాఫీ అని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

ఎరిస్ పేరుతో ఇన్ స్టాలో అకౌంట్ కూడా ఉంది. దానికి 2.4లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఆది ఆడుతున్న సమయంలో తీసిన ఫొటోలు దాని యజమాని సోషల్ మీడియాలో పోస్టు చేస్తాడు. వాటిని చూసి అంతా ఎంజాయ్ చేస్తున్నారు.

ఎరిస్.. రష్యన్ హంటింగ్ సైట్ హౌండ్ జాతి కుక్క. ఇళ్లలో పెంచుకుంటారు. చాలా ఎత్తైన బాడీ కలిగుంటాయి. పొడవైన కాళ్లు ఉంటాయి. మగ కుక్కలు 30-34 ఇంచుల పొడవు ఉంటాయి. ఆడ కుక్కలు 26-29 అంచుల పొడవు ఉంటాయి. ఈ జాతి శునకాలు 10 నుంచి 12ఏళ్లు వరకు జీవిస్తాయి.

ట్రెండింగ్ వార్తలు