anchor heart stroke
Anchor Heart Stroke On Live : అమెరికాలోని టుస్లా ఎన్బీసీ స్టేషన్‌లో ఓ యాంకర్‌కు లైవ్‌లో హార్ట్‌స్ట్రోక్ వచ్చింది. చంద్రుడి మీదకు అమెరికా పంపాల్సిన ఆర్టెమిస్ ప్రయోగం మరోసారి వాయిదా పడిన వార్తను చదువుతున్న సమయంలో యాంకర్ జూలీ చిన్‌లో స్ట్రోక్ లక్షణాలు కనిపించాయి. దీంతో ఆమె కాసేపు అసౌకర్యానికి గురయ్యారు. అయినప్పటికీ వార్త చదవడాన్ని ఆపలేదు.
గలగలా మాట్లాడే జూలీ చిన్ నోట మాటలు రావడం కష్టంగా మారింది. దీంతో తనకు ఏదో జరుగుతోందని అర్థం చేసుకున్న ఆమె తెలివిగా వ్యవహారించింది. స్టూడియో నుంచి బయటకు వెళ్లిపోతే ఏం అవుతుందోనని తెలివిగా ఇప్పుడు వాతావరణ వార్తలు విందాం అంటూ పక్కకు తప్పుకుంది.
Anchor swallows A fly Live on Air : లైవ్‌లో వార్తలు చదువుతూ ఈగను మింగేసిన యాంకర్
యాంకర్ జూలీ అసౌకర్యానికి గురికావడాన్ని గమనించిన సహోద్యోగులు అంబులెన్స్‌ను పిలిపించారు. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు. స్ట్రోక్ ప్రారంభ దశలోనే ఆస్పత్రికి రావడంతో ఆమె వెంటనే కోలుకుందని వైద్యులు చెప్పారు. అదే ఛానెల్‌లో పనిచేసే మైక్ సింగ్‌టాన్ ఈ ఘటనకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.
జూలీ ప్రస్తుతం బాగానే ఉందని, అయితే స్ట్రోక్ వార్నింగ్ సైన్స్ గురించి అందరికీ తెలియజేయాలనే ఉద్దేశ్యంతోనే ఈ వీడియో షేర్ చేస్తున్నట్లు తెలిపారు. యాంకర్ జూలీ చిన్ కూడా తన ఫేస్‌బుక్ ఖాతాలో తను కోలుకున్నట్లు పోస్టు పెట్టింది.