New York Times Square
boy gave a surprise to his girlfriend : తమకి ఎంతో ఇష్టమైన వాళ్ల పుట్టినరోజులు, పెళ్లిరోజులు వస్తే సర్ప్రైజ్ చేయాలని చాలామందికి ఉంటుంది. న్యూయార్క్‌లో ఉండే ఓ ఇండియన్ కుర్రాడు తన ప్రేయసికి ఎలాంటి సర్ప్రైజ్ ఇచ్చాడో చూడండి.
Teacher-Student Love Story : అతనికి 22.. ఆమెకు 48.. క్లాస్ టీచర్‌ని పెళ్లాడిన స్టూడెంట్
కొంతమంది తమ పుట్టినరోజులు చాలా సంతోషంగా జరుపుకుంటారు. అంతేకాదు తాము ఇష్టపడేవారి పుట్టినరోజులకు సర్ప్రైజ్‌లు ఇవ్వడానికి ముందుంటారు. న్యూయార్క్‌లో ఉంటున్న ఓ ఇండియన్ అబ్బాయి తన లవర్ బర్త్‌డేకి గొప్ప బహుమతి ఇచ్చాడు. టైమ్స్ స్క్వేర్ వద్ద డిజిటల్ బిల్ బోర్డ్‌పై తన ప్రేయసి ఫోటోలు డిస్‌ప్లే చేయించి ఆమెకు విషెస్ చెప్పాడు. ఇంకేముంది? ఆ అమ్మాయి ఆనందంలో మునిగిపోయింది. ఈ వీడియో ఆన్ లైన్‌లో అందరి హృదయాలను గెలుచుకుంది.
Pet Dog Birthday Party : పెంపుడు కుక్క బర్త్‌డే..రూ .4500 డ్రెస్ .. బంగారు గొలుసులు బహుమతి
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ Tales_by_Lekha షేర్ చేసిన క్లిప్‌లో టైమ్స్ స్క్వేర్ దగ్గర పెద్ద డిజిటల్ బిల్ బోర్డు ముందు ప్రేమ జంట ఫోటోలకు ఫోజులు ఇస్తుంటారు. ఆమె వెనక్కి తిరగ్గానే బిల్ బోర్డ్ మీద వీడియో ప్లే అవుతుంది. ఒక్కసారిగా ఆమె ఆశ్చర్యంలో మునిగిపోయింది. ఇష్టమైన వారి నుంచి అందుకునే ఇలాంటి సర్ప్రైజ్‌లే కదా జీవితకాలం గుర్తుండిపోయేవి. ‘ప్రియురాలికి అందమైన కానుక ఇచ్చావ్’ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.