Pet Dog Birthday Party : పెంపుడు కుక్క బ‌ర్త్‌డే..రూ .4500 డ్రెస్ .. బంగారు గొలుసులు బహుమతి

ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా చేశాడు. పుట్టిన రోజుకు తన బుజ్జి కుక్కకు ఏకంగా రూ.4.500 పెట్టి మాంచి డ్రెస్ కొన్నాడు. 350మంది అతిథులను పిలిచి నానా హంగామా చేశారు. సోషల్ మీడియాలో పెట్ డాగ్ బర్తే డే సెలబ్రేషన్ వైరల్ అయ్యింది. కుక్కనైనా పుట్టకపోతినే అని కొంతమంది ఫీల్ అయ్యేంత రేంజ్ చేశాడా యజమాని.

Pet Dog Birthday Party : పెంపుడు కుక్క బ‌ర్త్‌డే..రూ .4500 డ్రెస్ .. బంగారు గొలుసులు బహుమతి

Pet dog birthday party

celebrates pet dog’s birthday : పెంపుడు జంతువుల్ని ప్రాణంతో సమానంగా చూసుకుంటారు వాటి యజమానులు. వాటికి చిన్నపాటి నలత చేసిన బాధపడిపోతారు. కొంతమంది అయితే పెంపుడు జంతువులకు పుట్టిన రోజు వేడుకలు.. చేస్తారు..శ్రీమంతం వేడుకలు కూడా చేస్తారు. అలాగే ఓ వ్యక్తి తన పెంపుడు కుక్కకు పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా చేశాడు. పుట్టిన రోజుకు తన బుజ్జి కుక్కకు ఏకంగా రూ.4.500 పెట్టి మాంచి డ్రెస్ కొన్నాడు. అంతేకాదు బంగారు గొలుసులు బర్త్ డే గిఫ్ట్ గా ఇచ్చాడు. సోషల్ మీడియాలో పెట్ డాగ్ బర్తే డే సెలబ్రేషన్ వైరల్ అయ్యింది. కుక్కనైనా పుట్టకపోతినే అని కొంతమంది ఫీల్ అయ్యేంత రేంజ్ చేశాడా యజమాని.

జార్ఖండ్‌లోని ధ‌న్‌బాద్‌లో సుమిత్ర కుమారి, సందీప్ కుటుంబం ఓ కుక్కను పెంచుకుంటోంది. దానికి ‘అక్స‌ర్’అనే పేరు పెట్టుకున్నారు. సుమిత్ర కుటుంబానికి అక్సర్ అంటే ప్రాణం. అక్సీ అని ముద్దుగా పిలుచుకుంటారు. ఈ అక్సర్ బ‌ర్త్‌డే వేడుకల‌ను ఘ‌నంగా చేయాలనుకున్నారు. దాని కోసం ఓ ఇన్విటేషన్ కూడా తయారు చేయించారు కుక్క య‌జ‌మానులు. తమ క్యూట్ డాగ్ బర్త్ డే సెలబ్రేషన్స్ కు సుమిత్ర 350 మందిని పిలిచారు. గ్రాండ్ గా బ‌ర్త్‌డే పార్టీ చేశారు ఇన్విటేష‌న్ కార్డులను ముద్రించ‌డం నుంచి రూ . 4500 ఖర్చు పెట్టి బర్త్ డే డ్ర‌ెస్ కొనటం వరకూ పెంపుడు కుక్క బ‌ర్త్‌డే పార్టీకి ఆ కుటుంబం చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

పెంపుడు కుక్క బ‌ర్త్‌డే కోసం చుట్టు పక్కల గ్రామాల వారినే కాదు ఏకంగా బెంగాల్‌లోని శ్రీపూర్ వంటి ప్రాంతాల నుంచి అతిధులు శున‌కం బ‌ర్త్‌డే పార్టీ కోసం ధ‌న్‌బాద్‌కు వచ్చారు. వస్తూ వస్తూ బ‌ర్త్‌డే డాగ్ కోసం మంచి మంచి గిఫ్టులు కూడా తెచ్చారు. అలా మూడు గోల్డ్ చైన్స్  పెంపుడు కుక్క‌కు బ‌హుక‌రించారు. అక్స‌ర్ కేక్ కటింగ్‌కు ముందు హార‌తి ఇచ్చారు. పెంపుడు కుక్క అక్సర్ బ‌ర్త్‌డే వేడుక‌ల‌కు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో ప్ర‌స్తుతం తెగ వైర‌ల‌వుతోంది.

ఈ వీడియోలో కుక్కకు సుమిత్ర ముద్దు పెడుతూండటం చూస్తే వారికి ఆ కుక్కంటే ఎంత ఇష్టమో తెలుస్తోంది. టేబుల్ పైన భారీ కేక్ కూడా ఈ వీడియోలో కనిపిస్తోంది. అక్స‌ర్ త‌మ కుటుంబ స‌భ్యుల్లో ఒక‌ర‌ని..మురిసిపోతు చెప్పుకొచ్చారు సుమిత్ర దంపతులు. రోడ్డు ప‌క్క‌న 20 రోజుల వ‌య‌సున్న కుక్క పిల్ల‌ను ఇంటికి తీసుకువ‌చ్చి పెంచుకున్నామ‌ని..అప్పటి నుంచి అది మా ప్రాణంగా మారిపోయిందని తెలిపారు.మేము ఎలా బర్త్ డే జరుపుకుంటామో మా అక్సర్ అంతకంటే ఎక్కువ ఘనంగా బ‌ర్త్‌డే చేయాలనుకున్నామని అందుకే మా బంధువులు, స్నేహితులను పిలిచి ఈ వేడుక జరుపుకున్నామని సందీప్ చెప్పుకొచ్చారు.