Leap Year : లీపు ఇయ‌ర్ రోజే వ‌చ్చే ప‌త్రిక గురించి తెలుసా? దీన్ని చ‌ద‌వాలంటే నాలుగేళ్లు ఆగాల్సిందే

లీపు సంవ‌త్స‌రం రోజు మాత్ర‌మే అంటే నాలుగు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి వ‌చ్చే ప్ర‌త్రిక గురించి మీకు తెలుసా.?

The French newspaper that only appears once every four years

లీపు సంవ‌త్స‌రం అంటే ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ప్ర‌తి నాలుగు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి వ‌స్తుంటుంది. ఈ రోజు (ఫిబ్ర‌వ‌రి 29) లీపు సంవ‌త్స‌రం అన్న సంగ‌తి తెలిసిందే. ఈ రోజు ఎవ‌రైనా పుట్టినా, పెళ్లి చేసుకున్నా కూడా మ‌ళ్లీ వాళ్ల బ‌ర్త్‌డేల‌ను, మ్యారేజ్‌డేల‌ను నాలుగేళ్ల‌కు ఒక‌సారి మాత్ర‌మే చేసుకునే అవ‌కాశం ఉంటుంది. సాధార‌ణంగా వార్తా ప‌త్రిక‌లు అంటే ప్ర‌తి రోజు వ‌స్తుంటాయి. లేదంటే వారానికి ఒక‌సారి, నెల‌కు ఓసారి వ‌చ్చే ప‌త్రిక‌లు చాలానే చూసి ఉంటాం. అయితే.. లీపు సంవ‌త్స‌రం రోజు మాత్ర‌మే అంటే నాలుగు సంవ‌త్స‌రాల‌కు ఒక‌సారి వ‌చ్చే ప్ర‌త్రిక గురించి మీకు తెలుసా.?

ఏంటి? అలాంటి ఓ ప‌త్రిక ఉందా? మాకు తెలియ‌దు అని అంటారా?. అవును అది మ‌న ద‌గ్గ‌ర కాదు క‌దా అంద‌రికి తెలిసి ఉండ‌క‌పోవ‌చ్చు. ఈ ప‌త్రిక ఫ్రాన్స్‌లో ఉంది. దీని పేరు ‘లా బౌగీ డు సపేర్ (ది సప్పర్స్ క్యాండిల్)’. ఇది కేవ‌లం లీపు సంవ‌త్స‌రం రోజునే అందుబాటులో ఉంటుంది. నేడు లీపు సంవత్స‌రం కావ‌డంతో ఈ ప‌త్రిక కొత్త సంచిక వెలువ‌డింది. 1980 సంవ‌త్స‌రం నుంచి ఈ ప‌త్రిక సంచిక వెలువ‌డుతోంది. నేడు వెలువ‌డిన సంచిక 12వది కావ‌డం గ‌మ‌నార్హం. దీని 13వ సంచిక కావాలంటే మ‌రో నాలుగు సంవత్స‌రాలు ఆగాల్సిందే..

ఈ ప‌త్రిక స్పెష‌ల్ ఏంటంటే?

అంత స్పెష‌ల్ ఏమి ఉంటుంద‌ని అంటారా? ఇందులోని వార్త‌లు వ్యంగాస్త్రాల‌తో కూడి ఉంటాయి. రోజువారి జీవితంలో జ‌రిగే విచిత్రాల‌పై సెటెర్ల రూపంలో వార్త‌ల‌ను అందిస్తారు. న‌వ్వుకోవాల‌నుకునే వారి కోస‌మే దీన్ని రూపొందిస్తున్నారు. ఇది ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉండ‌దు. కేవ‌లం రెండు ల‌క్ష‌ల కాపీల‌ను మాత్ర‌మే ముద్రిస్తారు. న్యూస్ ఏజెంట్లు, దుకాణాల ద్వారా మాత్ర‌మే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Dubai Multiple-Entry Visa : భారతీయ పర్యాటకుల కోసం దుబాయ్ మల్టీ ఎంట్రీ వీసా.. ఎలా దరఖాస్తు చేసుకోవాలి? పూర్తి వివరాలివే

మ‌రీ దీని ధ‌ర ఎంత‌ని అంటారా? 20 పేజీలు ఉండే దీని ధ‌ర 4.9 యూరోలు.. అంటే భార‌త క‌రెన్సీలో దాదాపు రూ.440. తొలిత‌రం కార్టూనిస్ట్ లీ సపేర్ కామెంబెర్ట్ గుర్తుగా ఈ ప‌త్రిక‌కు లా బౌగీ డు సపేర్ అని పేరు పెట్టిన‌ట్లు దీని ఎడిట‌ర్ జీన్ డి ఇండీ తెలిపారు. దీని చ‌దివి ప్ర‌జ‌లు కాసేపు బాగా న‌వ్వుకుంటార‌ని ఆశిస్తున్న‌ట్లు ఎడిట‌ర్ చెప్పారు.

ట్రెండింగ్ వార్తలు