×
Ad

ట్రంప్‌కి భారీ షాక్‌.. మారియా కొరీనా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి 2025.. ఎవరు ఈమె? ఏం చేశారు?

డిసెంబర్‌ 10న విజేతలకు నార్వే నోబెల్ కమిటీ పురస్కారాలను ప్రదానం చేస్తుంది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ నోబెల్ శాంతి బహుమతి 2025పై ఎన్నో ఆశలు పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ పురస్కారం కోసం ప్రపంచం ఈ సారి మరింత ఆసక్తిగా ఎదురు చూస్తున్న వేళ రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్ శాంతి బహుమతి 2025పై ప్రకటన చేసింది.

నోబెల్‌ శాంతి‌ బహుమతిని వెనిజులా ప్రజల ప్రజాస్వామ్య హక్కుల కోసం అహర్నిశలు పోరాడిన మారియా కొరీనా మచాడోకు అందజేయాలని నిర్ణయించింది. నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యానికి న్యాయమైన, శాంతియుత మార్పు సాధించేందుకు ఆమె చేసిన పోరాటాన్ని గౌరవిస్తూ ఈ బహుమతి ప్రకటించారు. ఈ మేరకు “ది నోబెల్‌ ప్రైజ్‌” ఎక్స్‌లో ఓ పోస్ట్ చేశారు.

తాజాగా, ఇజ్రాయెల్-గాజా మధ్య శాంతి ఒప్పందం కుదిరినా అది ఈ ఏడాది నోబెల్ శాంతి బహుమతి 2025 ఎంపికపై ప్రభావం చూపదని నార్వే నోబెల్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసింది. విజేత ప్రకటన శుక్రవారం ఆస్లోలో జరిగింది.

డిసెంబర్‌ 10న విజేతలకు నార్వే నోబెల్ కమిటీ పురస్కారాలను ప్రదానం చేస్తుంది. ఈసారి మొత్తం 338 నామినేషన్లు అందాయి. అందులో 244 వ్యక్తులతో పాటు 94 సంస్థలు ఉన్నాయి. అధికారిక ప్రకటనను ఐదుగురు సభ్యుల నార్వే నోబెల్ కమిటీ అధ్యక్షుడు జోర్గెన్ వాట్నే ఫ్రిడ్నెస్ నార్వే నోబెల్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రకటించారు.