Queen Elizabeth : ప్రిన్స్ ఫిలిప్‌ను పెళ్లిచేసుకున్న చర్చిలోనే క్వీన్ ఎలిజబెత్‌ ఆఖరి మజిలీ

ప్రిన్స్ ఫిలిప్‌ను పెళ్లిచేసుకున్న చర్చిలోనే క్వీన్ ఎలిజబెత్‌ ఆఖరి మజిలీ పూర్తి అవుతుంది. 13 ఏళ్ల వయస్సులో గ్రీస్, డెన్మార్క్‌ మాజీ రాకుమారుడు ఫిలిప్‌ మౌంట్ బాటన్‌ ప్రేమలో పడ్డారు ఆమె. ఫిలిప్‌ను ఆమె మొదటిసారి 1934లో కలిశారు. ఫిలిప్‌ బ్రిటిషర్ కాకపోయినా ఎన్నో ఆటంకలను ఎదుర్కొని తను ప్రేమించిన వ్యక్తినే వివాహం చేసుకున్న ధీర క్వీన్ ఎలిజబెత్. అటువంటి రాణీ ఎలిజబెత్ ఆఖరి మజిలా అదే చర్చిలో జరుగనుంది.

Queen Elizabeth  : ద గ్రేట్ బ్రిటన రాణీ క్వీన్ ఎలిజబెత్ మరణం యావత్ ప్రపంచాన్ని కదిలించింది. ప్రపంచం యావత్తు ఆమెకు నివాళులు అర్పించింది. 13 ఏళ్లలోనే గ్రీస్, డెన్మార్క్‌ మాజీ రాకుమారుడు ఫిలిప్‌ మౌంట్ బాటన్‌ ప్రేమలో పడ్డారు ఆమె. ఫిలిప్‌ను ఆమె మొదటిసారి 1934లో కలిశారు. 1939లో అతనిని కలిసినప్పుడు ఎలిజబెత్‌కు 13ఏళ్లు. ఫిలిప్‌ బ్రిటిషర్ కాకపోవడం, ఆయనకు రాకుమారిని పెళ్లాడే స్థాయి లేకపోవడం.. పైగా అతని చెల్లి నాజీలతో సంబంధాలు ఉన్న ఒక రష్యన్ వ్యక్తిని పెళ్లి చేసుకోవడం వంటి కారణాలు.. ఎలిజబెత్‌ ప్రేమకు అడ్డుపడ్డాయ్.

ఐనా వాటిని ఎలిజబెత్ లెక్క చేయలేదు. ధైర్యంగా ఫిలిప్‌ను పెళ్లి చేసుకున్నారు. ప్రపంచాన్ని ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని తన స్టైల్‌ ఏంటో ప్రపంచానికి చూపించిన ధీర  ఎలిజబెత్.. 1947లో ఫిలిప్‌ ను ఎలిజబెత్ చారిత్రక వెస్ట్‌మినిస్టర్ అబే చర్చిలో వివాహం చేసుకున్నారు. అలా చారిత్రక వెస్ట్‌మినిస్టర్ అబే చర్చికి, రాణి ఎలిజబెత్‌కు ప్రత్యేక సంబంధం ఉంది. ఆమె వైవాహిక జీవితంలో ప్రారంభమైన ఈ  చర్చిలోనే ఆమె ఆఖరి మజిలీ పూర్తవుతుంది. క్వీన్ శవపేటికపై రాయల్ స్టాండర్డ్ పతాకం కప్పుతారు.

బ్రిటన్‌కు సుదీర్ఘకాలం పాటు రాణిగా ఉన్న ఎలిజబెత్…ఎన్నో పరిణామాలకు ప్రత్యక్ష సాక్షి. విన్‌స్టన్ చర్చిల్ నుంచి లిజ్ ట్రస్ వరకు 15 మంది ప్రధానులను చూశారు ఎలిజబెత్. ఆమెకు సంబంధం లేకపోయినప్పటికీ..బ్రిటన్ వైభవోపేత గతానికి, అనిశ్చితితో కూడిన భవిష్యత్‌కు మధ్య సంధానకర్తగా ఉన్నారు. ఆమె రాణిగా పదవి చేపట్టేనాటికి బ్రిటన్ ప్రపంచాన్ని గడగడలాడించిన నేపథ్యం ఉన్న దేశం. ఆమె మరణించే సమయానికి ప్రపంచంలోని మిగిలిన దేశాల్లోలానే మామూలు దేశం. ఆమె పుట్టి పెరిగిన పరిస్థితులకు, చనిపోయేనాటికి పూర్తి వైవిధ్యం ఉంది. ఒకప్పుడు రాణి అంటే…ఆమెను ఓ సారి కంటితో చూడగలిగినా చాలు అని సాధారణ ప్రజలు అనుకునే పరిస్థితి. కానీ తర్వాత కాలంలో సామాన్య ప్రజలతోనూ రాణి మమేకమయ్యారు. ఇక బ్రిటన్ రాణి అంటే ఒకప్పుడు ప్రపంచ దేశాలందరికీ రాణి అనే అభిప్రాయం ఉంటుంది. ఇప్పుడు ఆ స్థాయి లేదు. ఆమె హోదాను అందరూ గుర్తిస్తారు. గౌరవిస్తారు. కానీ బ్రిటన్ వెలుపల రాణి అంటే..ఒకప్పటిలా… వైభవానికి చిహ్నంగా చూసే పరిస్థితి లేదు.

ప్రేమించి పెళ్లిచేసుకున్న భర్తతో సుదీర్ఘ వైవాహిక జీవితంతో కుటుంబంలో ఆమె అందరికీ ఆదర్శప్రాయంగా ఉన్నారు. అయితే ఆమె పిల్లలు అనేక వివాదాల్లో చిక్కుకున్నారు. కొందరు విడాకులు తీసుకున్నారు. ప్రిన్స్ చార్లెస్, డయానా ఉదంతంతో బకింగ్ హామ్ ప్యాలెస్ నవ్వులు పాలయిందన్న అభిప్రాయం కలిగింది. ఆ తర్వాత చార్లెస్ కెమిల్లాను వివాహం చేసుకోవడం, ప్రిన్స్ విలియమ్స్ ఓ సామాన్యురాలిని పెళ్లిచేసుకోవడం, ప్రిన్స్ హ్యారీ నల్లజాతి మహిళను జీవితభాగస్వామిని సుకోవడమన్నీ..రాజకుటుంబంలో వచ్చిన మార్పులు.

 

ట్రెండింగ్ వార్తలు