Amazing Dog : 17 ఏళ్ల యువకుడి ప్రాణాలు కాపాడటం కోసం ఆ డాగ్ ఏం చేసిందంటే?.. చదవండి

కుక్క విశ్వాసం కల జంతువు. తన యజమానికి నమ్మిన బంటులా ఉంటుంది. ఓ అమేజింగ్ డాగ్ గురించి చెప్పాలి. తన యజమాని కొడుక్కి ప్రాణాపాయస్థితి వస్తే ఎలా కాపాడిందో తెలిస్తే దాన్ని మెచ్చుకోకుండా ఉండరు.

Amazing Dog

Amazing Dog : చాలామంది శునకాల్ని ఇష్టపడతారు. తమ బెస్ట్ ఫ్రెండ్ లాగ.. కుటుంబ సభ్యుల్లాగ వాటిని ట్రీట్ చేస్తారు. శునకాలకి ఉన్న విశ్వాసం మనిషికి కూడా లేదని చెప్తారు. ఆక్సెల్ అనే అమేజింగ్ డాగ్ గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. అక్సెల్ తన యజమానులను నిద్రలేపి వాళ్ల 17 ఏళ్ల కొడుకు ప్రాణాలు కాపాడింది. ఇంతకీ అతనికేమైంది? చదవండి.

Man turned into a dog : అయ్యో! అతను శునకంలా మారిపోయాడు.. ఎక్కడో తెలుసా?

ఆక్సెల్ అనే డాగ్ 17 సంవత్సరాల యువకుడి జీవితాన్ని ఎలా కాపాడిందో తెలిపే కథనం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆక్సెల్ తన యజమానులను నిద్ర లేపడం ద్వారా స్ట్రోక్‌తో బాధపడుతున్న వారి కొడుకు గాబ్రియెల్ ప్రాణాలు కాపాడటంలో సహాయం చేసింది. తన యజమాని కొడుకు తెల్లవారు ఝామున అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నట్లు ఆక్సెల్ కనిపెట్టింది. అస్సలు ఆలస్యం చేయకుండా తన యజమానుల గదిలోకి వెళ్లి మంచం మీద అటు ఇటు దూకడం మొదలుపెట్టిందట. దానికి బయటకు వెళ్లమన్నా వెళ్లకుండా గాబ్రియేల్ ఉన్న రూమ్ ముందు కదలకుండా నిలబడిందట. గాబ్రియేల్ తండ్రికి ఏదో జరిగిందని అనుమానం వచ్చి కొడుకు రూమ్‌లోకి వెళ్లాడట. కొడుకు పరిస్థితిని గమనించిన వెంటనే తండ్రి ఆసుపత్రికి తరలించాడు. సమయానికి ఆక్సెల్ కనిపెట్టడంతో అతనికి ప్రాణాపాయస్థితి తప్పింది. గాబ్రియేల్ పూర్తిగా కోలుకోవడంతో అతని కుటుంబం మొత్తం ఆక్సెల్‌కి ధన్యవాదాలు చెప్పింది. గాబ్రియేల్‌తో పాటు ఉన్న ఆక్సెల్ ఫోటో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది.

Kakinada : హృదయ విదారక ఘటన.. యజమాని చనిపోయిందని తెలీక ఆమె చెప్పుల దగ్గర కాపలా కాస్తున్న శునకం

weratedogs అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఆక్సెల్  గాబ్రియేల్ జీవితాన్ని కాపాడిన కథ చదివి నెటిజన్లు ఆశ్యర్యపోయారు. సూపర్ హీరో అంటూ అభినందనలు తెలిపారు.