COVID-19 అందరిలోనూ ఒకేలా కనిపించదు..: Trumpకు Mild Symptoms

President Donald Trump అతని భార్య మెలానియా ట్రంప్ కొవిడ్-19 పాజిటివ్ అని తెలియడంతో వైట్ హౌజ్ లో భయాందోళన మొదలైంది. ఈ మేరకు స్టేట్‌మెంట్ కూడా రిలీజ్ చేసింది. ప్రెసిడెంట్ కు పాజిటివ్ వచ్చింది కానీ, అవి Mild Symptoms అని చెప్పింది. వైట్ హౌజ్ స్టాఫ్ చీఫ్ పర్సన్ నోటి నుంచి ఆ పదం విన్నప్పటి నుంచి Mild Symptoms అనే దానిపై క్లారిటీ కోసం చూస్తున్నారు.

మెన్ హెల్త్ అడ్వైజర్ ఎండీ రాబర్ట్ గ్లాట్టర్, న్యూయార్క్ సిటీ ఎమర్జెన్సీ ఫిజిషియన్ చెప్పిన దాని ప్రకారం..Mild Symptoms అంటే పొడిదగ్గు, లో ఫీవర్, కండరాల నొప్పి, నీరసం, వికారం, వాసన.. రుచి స్వభావం కోల్పోవడం.



సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ COVID-19అనేది చాలా లక్షణాలతో ఉండొచ్చు. Mild Symptomsనుంచి తీవ్రమైన అనారోగ్యం వరకూ. తీవ్రమైన జబ్బు లక్షణాలు ఏమంటే.. శ్వాసలో ఇబ్బంది, ఛాతీ నొప్పి, జ్వరం పెరిగిపోతుండటం, చికాకు, న్యూరలాజికల్ సమస్యలు రావొచ్చు. (న్యూరలాజికల్ సమస్యలు అంటే బ్రెయిన్ స్ట్రోక్ లు వంటివి).

లక్షణాలు డెవలప్ అవుతూ ఉన్నవారు రికవరీ అవ్వొచ్చు. కానీ అలా కొద్ది కాలం తర్వాత మళ్లీ వారిలో లక్షణాలు బయటపడే ప్రమాదం ఉంది. లక్షణాలు అనేవి 2నుంచి 14రోజుల లోపే బయటపడతాయి.

  • జ్వరం లేదా వణుకు
    దగ్గు
    శ్వాసలో ఇబ్బంది లేదా తక్కువగా శ్వాస తీసుకోవడం
    నీరసం
    కండరాలు లేదా ఒళ్లు నొప్పులు
    తలనొప్పి
    వాసన లేదా రుచి కోల్పోవడం
    గొంతు మంట
    ముక్కు కారుతుండటం
    వాంతులు
    విరేచనాలు
    స్పృహ కోల్పోతుండటంవీటి కంటే మరికొన్ని లక్షణాలు కనిపించొచ్చు. అలా ఉన్నప్పుడు కచ్చితంగా మెడికేషన్ అనేది తప్పనిసరి.
  • శ్వాస అందకపోవడం
    ఛాతీలో నొప్పి
    అయోమయంగా ఉండటం
    మెలకువగా ఉండలేకపోవడం
    పెదాలు లేదా ముఖం నీలిరంగులోకి మారిపోవడం



ట్రెండింగ్ వార్తలు