World Popular Indian Sweets : మైసూర్ పాకా మజాకా.. వరల్డ్ బెస్ట్ స్ట్రీట్ స్వీట్ ఫుడ్స్‌లో చోటు .. కుల్ఫీ కూడా

ఇండియాలో స్ట్రీట్ ఫుడ్ ఎంత ఫేమస్సో.. వాటిలో స్వీట్స్ అంత ఫేమస్.. 'ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్' జాబితా ఒకటి బయటకు వచ్చింది. అందులో మన ఇండియన్ స్ట్రీట్ స్వీట్ ఫుడ్స్ ఏమున్నాయో.. ఒకసారి చూడండి.

World Popular Indian Sweets

World Popular Indian Sweets : ఇండియాలో ఎక్కువగా స్ట్రీట్ ఫుడ్‌కి ఆదరణ ఉంది. అనేక రకాల స్వీట్స్ ఇక్కడ ఫేమస్. అయితే ప్రపంచంలోనే పేరుగాంచిన స్ట్రీట్ ఫుడ్ స్వీట్లలో కొన్ని ఇండియన్స్ స్వీట్స్ పేరు సంపాదించుకున్నాయి. అవేంటో చూద్దాం.

Chatpata Dancing Bhelpuri : ‘చత్పటా డ్యాన్సింగ్ భేల్‌‌పురి’.. ఆకట్టుకుంటున్న స్ట్రీట్ ఫుడ్

భారతీయులు స్వీట్స్ బాగా ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా భోజనం ముగించే ముందు స్వీట్ తినడం ఇక్కడ  ఆనవాయితీగా ఉంది. కొన్ని చాక్లెట్స్, లేదా ఐస్ క్రీం, మిఠాయి ఇలా ఏదో ఒకటి ఖచ్చితంగా తింటారు. దేశ వ్యాప్తంగా ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకం ప్రసిద్ధి చెందిన స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్ దొరుకుతాయి. వీటిని పంచదార లేదా బెల్లంతో తయారు చేస్తారు. స్వీట్ తింటే కొత్త ఉత్సాహం వస్తుంది. అంతేనా స్వీట్స్ కోసం క్యూలో అయినా సరే నిలబడతారు. దేశ వ్యాప్తంగా ఇండియన్ పాపులర్ స్వీట్స్ ఎన్ని ఉన్నా.. ప్రపంచ వ్యాప్తంగా కూడా మన స్వీట్స్ పేరు సంపాదించుకున్నాయి. క్రొయేషియాకు చెందిన ఆన్ లైన్ ట్రావెల్ అండ్ ఫుడ్ గైడ్ టేస్ట్‌అట్లాస్ ప్రకారం ‘ప్రపంచంలోనే అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ స్వీట్స్’ లిస్ట్ రిలీజ్ చేసింది. ఇందులో మన భారతీయ స్వీట్లు కూడా చోటు దక్కించుకోవడం విశేషం.

Guatemala : అగ్నిపర్వతంపై పిజ్జా వండుకుని తిన్న మహిళ

దక్షిణ భారత దేశానికి చెందిన ‘మైసూర్ పాక్’ 14 వ ర్యాంకులో ఉండగా.. ‘కుల్ఫీ;కి 18 వ స్ధానం దక్కింది. ‘కుల్ఫీ ఫలూడా’ కూడా లిస్ట్ లో 32 వ స్ధానం దక్కించుకుంది. ఇక పోర్టుగీస్ ఎగ్ కస్టర్డ్ టార్ట్ అయిన ‘పాస్టెల్ డి నాటా’ ప్రపంచ వ్యాప్తంగా బెస్ట్ స్ట్రీట్ ఫుడ్ స్వీట్‌గా నంబర్ వన్ స్ధానంలో నిలిచింది. ఈ జాబితాలో ఇండోనేషియాలోని జావాకు చెందిన ‘సెరాబీ’ రెండో స్ధానం సంపాదించుకుంది. టేస్ట్‌అట్లాస్ ప్రకారం టర్కీలోని కహ్రామన్‌మరాస్‌కు చెందిన ‘దొందుర్మా’ ప్రపంచంలోనే మూడవ అత్యుత్తమ స్ట్రీట్ ఫుడ్ స్వీట్‌గా చోటు దక్కించుకుంది.