Lyrebird
Lyrebird : కొన్ని జంతువులు చేసే వింత శబ్దాలు మనుషులను భయపెడతాయి. ఎప్పుడు వినని వారైతే వాటి వింత శబ్దాలు విని పరుగులు తీస్తుంటారు. అయితే తాజాగా ఆస్ట్రేలియాలోని టారోంగా జూలో ఓ పక్షి చేస్తున్న వింత శబ్దం విని పర్యాటకులు భయపడుతున్నారు. ఆ పక్షి అచ్చం పసిపిల్లలు ఏడ్చినట్టుగా శబ్దం చేస్తుంది. దీనిని మొదటి సారి వింటే ఎవరు పక్షి అరుపని నమ్మరు. తదేకంగా గమనిస్తే తప్ప ఆ శబ్దం పక్షి చేస్తుందని నమ్మలేరు.
పక్షి జాతుల్లో ప్రత్యేకమైన దీనిపేరు లైర్ బర్డ్.. దీనికో ప్రత్యేకత ఉంది. ఈ పక్షి ఏదైనా శబ్దం వింటే దానిని మిమిక్రి చేస్తుంది. ఇది ఎప్పుడో చిన్న పిల్లాడి ఏడుపు విని ఉంటుంది. దానిని ఇప్పుడు మిమిక్రి చేస్తుంది. ఇక ఈ మిమిక్రి పక్షిని చూసేందుకు పర్యాటకులు భారీగా వస్తున్నారు. ఇక కోవిడ్ లాక్‌డౌన్ కారణంగా టారోంగా జంతు ప్రదర్శనశాల గత కొద్ది కాలంగా మూసివేయబడినప్పటికీ.. నిత్యం జూ-కీపర్లు ఇటీవల పెద్దగా అరుస్తున్న శబ్దాలు, ఏడుస్తున్న శబ్దాలు వింటున్నారు.
దీంతో జూలోని సీసీ కెమెరాలను పరిశీలించారు. అయినా ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వస్తున్నాయన్నది తెలియలేదు. చివరకు ఓ కెమెరాలో బంధించిన వీడియోలో స్పష్టమైన శబ్దంతోపాటు పక్షి నోరు కదలికలను పసిగట్టారు. పక్షే ఈ శబ్దం చేస్తుందని గుర్తించారు. కాగా జూలో ఉండే చాలామంది సిబ్బందికి ఈ పక్షి మిమిక్రి చేస్తుందనే సంగతి తెలియదట!
Bet you weren’t expecting this wake-up call! You’re not hearing things, our resident lyrebird Echo has the AMAZING ability to replicate a variety of calls – including a baby’s cry!
?️ via keeper Sam #forthewild #tarongatv #animalantics pic.twitter.com/RyU4XpABos
— Taronga Zoo (@tarongazoo) August 30, 2021