Multiple Husbands
Multiple Husbands: అనేక మంది భార్యలను పొందడానికి మగాళ్లకు ఎలా అయితే పర్మిషన్ ఇచ్చారో.. అలాగే మహిళలకు అనేకమంది భర్తలను పెళ్లాడొచ్చని చెప్పింది ప్రభుత్వం. దక్షిణాఫ్రికాలోని హోం అఫైర్స్ డిపార్ట్‌మెంట్.. కొత్త వివాహ చట్టాన్ని అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది. ప్రస్తుత మ్యారేజ్ చట్టం సమానత్వం చూపించడం లేదని.. వివాహం గురించి చేసిన చట్టం వివక్షాపూరితమైనదిగా ఉందని పేర్కొంది.
హిందువులు, యూదులు, ముస్లింలు, రాస్తఫరియన్ వివాహాలకు తేడా లేకుండా ఉందని పేర్కొంది. ఇంకా ఈ పాలసీ డాక్యుమెంట్లో.. పొలియాండ్రీని చట్ట బద్ధం చేయాల్సి ఉందని చెబుతున్నారు.
దీనిపై మానవ హక్కుల కార్యకర్తలు, ఇతర గ్రూపులు వారు ప్రపోజల్ తీసుకొచ్చే ముందు కీలక విషయాలు ప్రస్తావించారు. ఆ తర్వాతే మగాళ్లకు ఎలా అయితే అనేక మంది భార్యలను పొందే అధికారం ఉందో.. భర్తలకు అలాగే పొందొచ్చని నిర్ణయానికి వచ్చారు. Multiple Husbands