Syrian Artist : కొత్త ఒరవడి, కలర్స్ కొనడానికి డబ్బుల్లేవు..మట్టితో పెయింటింగ్

జూలియా సిరియాకు చెందిన ఈమె ఆర్టిస్టు. ఈమెకు పెయింటింగ్ అంటే ప్రాణం. కొన్ని కారణాల వల్ల ఇంటిని వదిలేయాల్సి వచ్చింది.

Syria

Paint For Soil :  పెయింటింగ్ అంటే ఎంతో ఇష్టం. కానీ పెయింటింగ్ వేయడానికి కావాల్సిన కలర్స్, ఇతరత్రా సామాగ్రీ కొనడానికి డబ్బుల్లేవు. అయితే..అలానే కూర్చొలేదు. తనకిష్టమైన పెయింటింగ్ ను వేశారు. కలర్స్ లేవు..మరి ఎలా వేశారు ? అనేగా మీ డౌట్. కళను చంపుకోలేక…కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. కలర్స్ బదులు మట్టిని ఉపయోగించి…అద్భుతమైన పెయింటింగ్ వేశారు. ఈ పెయింటింగ్ అందరినీ ఆకట్టుకొంటోంది. సోషల్ మీడియాలో ఈమె వేసిన పెయిటింగ్ వీడియో హల్ చల్ చేస్తోంది.

Read More : Nizamabad : లక్ష్మీదేవికి కోటి రూపాయలతో అలంకరణ

జూలియా సిరియాకు చెందిన ఈమె ఆర్టిస్టు. ఈమెకు పెయింటింగ్ అంటే ప్రాణం. కొన్ని కారణాల వల్ల ఇంటిని వదిలేయాల్సి వచ్చింది. అయితే..తనకు ఎంతో ఇష్టమైన పెయింటింగ్ వేయడానికి ఆమె దగ్గర సరిపడా డబ్బులు లేవు. అయినా..సరే..మట్టిని ఉపయోగించి పెయిటింగ్ వేద్దామని ట్రై చేసింది. అందులో సక్సెస్ అయ్యింది. అద్భుతమైన చిత్రాలు ఆమె చేతి నుంచి వచ్చాయి. కళను బతికించుకోవడం కోసం మట్టితో వేయడం ప్రారంభించడం జరిగిందని, ప్రస్తుతం కలర్స్ ఉన్నా..మట్టితో పెయిటింగ్ వేయడమే తనకు నచ్చుతోందన్నారు.

Read More : AP Govt: ఏపీకి రెవెన్యూ లోటు గ్రాంట్ నిధుల విడుదల

మట్టితో అద్భుతమైన పెయిటింగ్స్ వేసిన జూలియా వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జూలియా వేసిన సాయిల్ పెయింటింగ్ ప్రస్తుతం అక్కడ బాగా వైరల్ అయ్యింది. చాలా మందికి నచ్చింది. ఈ కళను అందరికీ తెలిసే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు జూలియా. చిన్న పిల్లలకు ఎలా పెయటింగ్ వేయాలో నేర్పిస్తున్నారు.