Viral Video: ఈ స్లైడ్‌పై జారితే ఒళ్లు విరగడం ఖాయం.. అయినా ఎంజాయ్ చేస్తున్న జనం.. వీడియో వైరల్
ఈ వీడియో చూస్తే ఒళ్లు జలధరించడం ఖాయం. ఎందుకంటే ప్రమాదకరంగా ఉన్న స్లైడ్ పై నుంచి కొందరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండానే జారుతున్నారు. ఈ వీడియోకు ఇప్పటివరకు 11 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. కావాలంటే మీరూ చూడండి.
- Narender Thiru
- Published On : August 26, 2022 / 04:59 PM IST
Viral Video: అమ్యూజ్‌మెంట్ పార్కుల్లో ఉండే స్లైడ్స్ బోలెడంత థ్రిల్ ఇస్తాయి. ఎంతో ఎత్తు నుంచి కిందికి, వేగంగా జారే స్లైడ్స్ ఎక్స్‌పీరియెన్స్ చేయాలని చాలామంది కోరుకుంటారు. ముఖ్యంగా అడ్వెంచరస్ యాక్టివిటీస్ ఇష్టపడే వాళ్లకు ఇవి మంచి ఛాయిస్.
Pizza Delivery Boy: చిరిగిన నోటు తీసుకోలేదని పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. పరిస్థితి విషమం
అయితే, అవి ఎంత ఎత్తు నుంచి కిందికి జారినా, వాటివల్ల ఎలాంటి ప్రమాదం లేకుండా నిర్వాహకులు తగిన జాగ్రత్తలు తీసుకుంటారు. ముఖ్యంగా వాటి ఉపరితలం చాలా నునుపుగా, చదునుగా ఉండేలా చూస్తారు. కానీ, అమెరికాలోని ఒక జెయింట్ స్లైడ్ మాత్రం వీటికి భిన్నంగా, ఎత్తుపల్లాలతో ఉంది. పైగా అది పూర్తిగా ఐరన్‌తో తయారైంది. దీనిపై జారితే ఒళ్లు విరగడం, గాయాలవడం ఖాయం. మిచిగాన్ రాష్ట్రంలో, బెల్లె ఐల్ పార్కులో ఈ స్లైడ్ ఏర్పాటు చేశారు. ఇటీవల దీనికి మరమ్మతులు చేసేందుకు ఈ స్లైడ్‌ను నిలిపివేశారు. ఆ సమయంలో కొందరు దీనిపై నుంచి జారారు. అది కూడా.. ఎలాటి జాగ్రత్తలు తీసుకోకుండానే.
Jet Airways: మూడున్నరేళ్ల తర్వాత ప్రారంభం కానున్న జెట్ ఎయిర్‌వేస్ సేవలు
కొందరు వ్యక్తులు గోనె సంచి మాత్రమే చుట్టుకుని, దానిపై నుంచి జారారు. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు ఆ వీడియో 11 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించింది. ప్రమాదకరంగా ఉన్న ఈ స్లైడ్‌పై వాళ్లంతా ఎలా జారుతున్నారో అంటూ నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కావాలంటే ఆ వీడియో మీరూ చూడండి.
The giant slide at Belle Isle Park in Michigan was open for only 4 hours before workers shut it down to make adjustments.
I wonder why they decided to do such a thing ? pic.twitter.com/q7jpFdLdAO
— Art (@artcombatpod) August 19, 2022
