Pizza Delivery Boy: చిరిగిన నోటు తీసుకోలేదని పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. పరిస్థితి విషమం

చిరిగిన నోటు స్థానంలో మంచి నోటు ఇవ్వమని అడిగినందుకు పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బాధితుడి స్నేహితుడు అతడ్ని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది.

Pizza Delivery Boy: చిరిగిన నోటు తీసుకోలేదని పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు.. పరిస్థితి విషమం

Pizza Delivery Boy: ఉత్తర ప్రదేశ్‌లో దారుణం జరిగింది. చిరిగిన కరెన్సీ నోటు స్థానంలో వేరే నోటు ఇవ్వమని అడిగినందుకు పిజ్జా డెలివరీ బాయ్‌పై కాల్పులు జరిపారు ఇద్దరు వ్యక్తులు. ఈ ఘటనలో బాధితుడికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బరేలీ ప్రాంతానికి చెందిన నదీమ్ ఖాన్, నయీమ్ అనే అన్నదమ్ములు బుధవారం రాత్రి 11 గంటలకు ఫోన్ ద్వారా పిజ్జా ఆర్డర్ చేశారు.

Jet Airways: మూడున్నరేళ్ల తర్వాత ప్రారంభం కానున్న జెట్ ఎయిర్‌వేస్ సేవలు

ఔట్‌లెట్ నుంచి వచ్చిన సూచన ప్రకారం.. సచిన్ కశ్యప్, అతడి స్నేహితుడు రితిక్ కుమార్.. ఇద్దరూ కలిసి పిజ్జా డెలివరీ చేసేందుకు వెళ్లారు. అక్కడ నదీమ్, నయీమ్‌కు పిజ్జా డెలివరీ చేసి, వాళ్లు ఇచ్చిన డబ్బులు తీసుకుని వెళ్లిపోయారు. దగ్గర్లో ఉన్న ఒక షాపులో కూల్ డ్రింక్ తాగి, నయీమ్ బ్రదర్స్ ఇచ్చిన రెండు వందల రూపాయలు చెల్లించారు. అయితే, ఆ షాప్ అతను ఆ నోటును అంగీకరించలేదు. అది చిరిగిందని, చెల్లదని చెప్పాడు. దీంతో వాళ్లు వేరే నోటు ఇచ్చి, తిరిగి నయీమ్ బ్రదర్స్ దగ్గరికి వెళ్లారు. అంతకుముందు వాళ్లు ఇచ్చిన రెండు వందల రూపాయల నోటు చిరిగిందని, దాని బదులు వేరే నోటు ఇమ్మని అడిగారు. దీనికి వాళ్లు వేరే నోటు ఇచ్చేందుకు నిరాకరించారు. ఈ క్రమంలో చిన్న వాగ్వాదం జరిగింది.

Nani Dasara Movie : సమ్మర్ కి రెడీ అంటున్న దసరా.. ‘ఎట్లైతే గట్లే సూస్కుందామ్‌’.. సిల్క్‌స్మిత ఫోటో ముందు మందు సీసాతో నాని..

అంతే వెంటనే కోపం తెచ్చుకున్న నయీమ్.. తన ఇంట్లో ఉన్న దేశీ తుపాకి తీసుకొచ్చి సచిన్ కశ్యప్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సచిన్ స్నేహితుడు అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. ప్రస్తుతం బరేలీలోని మెడికల్ సెంటర్‌లో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి తీవ్ర విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు.