Nani Dasara Movie : సమ్మర్ కి రెడీ అంటున్న దసరా.. ‘ఎట్లైతే గట్లే సూస్కుందామ్‌’.. సిల్క్‌స్మిత ఫోటో ముందు మందు సీసాతో నాని..

సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న దసరా సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సమ్మర్ కానుకగా............

Nani Dasara Movie : సమ్మర్ కి రెడీ అంటున్న దసరా.. ‘ఎట్లైతే గట్లే సూస్కుందామ్‌’.. సిల్క్‌స్మిత ఫోటో ముందు మందు సీసాతో నాని..

Nani Dasara Movie release date announced

Updated On : August 26, 2022 / 1:01 PM IST

Nani Dasara Movie :  ఇటీవల అంటే సుందరానికి లాంటి క్లాస్ సినిమాతో ప్రేక్షకులని పలకరించిన నాని త్వరలో దసరా అంటూ ఫుల్ మాస్ క్యారెక్టర్ తో రాబోతున్నాడు. నాని, కీర్తి సురేష్ జంటగా కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న దసరా సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, గ్లింప్స్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశారు. మొదటి సారి నాని ఫుల్ మాసి క్యారెక్టర్ చేస్తుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి.

Anupam Kher : బాలీవుడ్ లో డబ్బుల కోసం సినిమాలు తీస్తుంటే సౌత్ లో మంచి కంటెంట్ తో సినిమాలు తీస్తున్నారు..

సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో తెరకెక్కుతున్న దసరా సినిమా రిలీజ్ డేట్ ని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ మేరకు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సమ్మర్ కానుకగా 2023 మార్చి 30న దసరా సినిమాని రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్‌ డేట్‌ పోస్టర్‌ని నాని షేర్‌ చేస్తూ..”ఎట్లైతే గట్లనే సూస్కుందామ్‌. ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుంది” అని ట్వీట్ చేశాడు. నాని షేర్ చేసిన పోస్టర్ లో ఓ గోడ మీద సిల్క్ స్మిత పెయింట్ వేసి ఉండగా దాని ముందు నాని ఓ మందు సీసాని పట్టుకొని కూర్చున్నట్లు చూపించారు. ఇక ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో రిలీజ్ కానుంది.