Jet Airways: మూడున్నరేళ్ల తర్వాత ప్రారంభం కానున్న జెట్ ఎయిర్‌వేస్ సేవలు

ప్రముఖ విమానయాన సంస్థ జెట్ ఎయిర్‌వేస్ త్వరలో విమానయాన సేవల్ని ప్రారంభించనుంది. 2019లో నిలిచిపోయిన సేవల్ని ఈ ఏడాది చివరికల్లా ప్రారంభిస్తామని కంపెనీ వెల్లడించింది. గతంలో పనిచేసిన సిబ్బందినే ఈసారి కూడా ఎక్కువగా తీసుకున్నట్లు చెప్పింది.

Jet Airways: మూడున్నరేళ్ల తర్వాత ప్రారంభం కానున్న జెట్ ఎయిర్‌వేస్ సేవలు

Jet Airways: మూడేళ్ల క్రితం నిలిచిపోయిన జెట్ ఎయిర్‌వేస్ విమానయాన సేవలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా వెల్లడించింది. ఈ ఏడాది చివరి నుంచి విమానాలు ప్రారంభమవుతాయని, దీనికి సంబంధించి సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని కంపెనీ తెలిపింది.

Bandi Sanjay padayatra : యువకుడిపై బీజేపీ కార్యకర్తల దాడి..బండి సంజయ్ పాదయాత్రలో మరోసారి ఉద్రిక్తత..

అనుభవం కలిగిన క్యాబిన్ క్రూ శిక్షణా కార్యక్రమం ప్రారంభమైందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ సంస్థ త్వరలో ప్రారంభించబోయే సర్వీసుల కోసం ఇప్పటికే సిబ్బందిని నియమించుకుంది. గతంలో సంస్థలో పని చేసిన వాళ్లనే ఎక్కువ మందిని తీసుకున్నట్లు చెప్పింది. ప్రస్తుతం 50 శాతానికి పైగా సిబ్బంది గతంలో జెట్ ఎయిర్‌వేస్‌లో పనిచేసిన వాళ్లేనని తెలిపింది. గతంలో కంటే ఈసారి మరింత మెరుగైన సేవలు అందిస్తామని జెట్ ఎయిర్‌వేస్ సంస్థ సీఈవో సంజీవ్ కపూర్ తెలిపారు. ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త నరేష్ గోయెల్ ఈ సంస్థను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే, 2019లో ఆర్థిక ఇబ్బందుల కారణంగా సంస్థ కార్యకలాపాలు నిలిచిపోయాయి.

Nani Dasara Movie : సమ్మర్ కి రెడీ అంటున్న దసరా.. ‘ఎట్లైతే గట్లే సూస్కుందామ్‌’.. సిల్క్‌స్మిత ఫోటో ముందు మందు సీసాతో నాని..

ఏప్రిల్ 17, 2019 నుంచి జెట్ ఎయిర్‌వేస్‌ సంస్థ సర్వీసులు నిలిచిపోయాయి. అప్పట్నుంచి నిధులు సమకూర్చుకునేందుకు ప్రయత్నించింది. తాజాగా ఈ సమస్య పరిష్కారం కావడంతో విమానయాన సర్వీసులు ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. మరోవైపు విమానాలు నడుపుకొనేందుకు కావాల్సిన ఎయిర్ ఆపరేటర్ సర్టిఫికెట్‌ను డీజీసీఏ నుంచి ఇటీవలే పొందింది. దీంతో విమానయాన సేవల్ని మొదలుపెట్టనుంది. అయితే, ముందుగా దేశీయంగానే విమానాల్ని నడపనుంది సంస్థ. మొత్తం 20 విమానాలు సేవలు అందించబోతున్నాయి.