న్యూజిలాండ్‌లో కాల్పుల మరువకముందే.. నెదర్లాండ్స్‌లో కాల్పులు

  • Publish Date - March 19, 2019 / 04:09 AM IST

న్యూజిలాండ్‌లో ఉగ్రవాది కాల్పుల ఘటన మరువకముందే..  నెదర్లాండ్స్‌లోని డచ్ సిటీ ఆఫ్ యుట్రెక్ట్‌లో గుర్తు తెలియని వ్యక్తి విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మరణించగా.. 9మంది గాయపడ్డారు. డచ్ సిటీలోని ట్రామ్ వే స్టేషన్‌లో ట్రామ్ బండిలో ఉదయం 10 గంటల 45నిమిషాలకు(స్థానిక కాలమానం ప్రకారం) గుర్తు తెలియని వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. స్టేషన్‌లో ట్రామ్ కోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులపై యథేచ్ఛగా కాల్పులు జరిపినట్లు నెదర్లాండ్స్ పోలీసులు వెల్లడించారు. 
Read Also : చైనాకు దలైలామా వార్నింగ్: నా వారసుడు భారతీయుడే

ఈ దారుణానికి పాల్పడ్డ వ్యక్తి అని అనుమానిస్తున్న 37ఏళ్ల గోక్‌మెన్ టానిస్ అనే టర్కిష్ అని భావించి అతనిని అరెస్ట్ చేశారు. ఘటన జరిగిన ప్రదేశానికి మూడు మైళ్ల దూరంలోని ఓ భవనంలో అతనిని అరెస్టు చేశారు. అయితే దాడిపై పూర్తి క్లారిటీ రాలేదన్న పోలీసులు.. నగరంలో పాఠశాలలను మూసివేశారు. భద్రతను కట్టుదిట్టం చేశారు. ప్రమాద హెచ్చరికలను జారీ చేశారు.

ఈ దాడిలో టెర్రరిస్టుల ప్రమేయాన్ని కూడా కొట్టిపారేయలేం అని అధికారులు చెబుతున్నారు. అయితే పూర్తి వివరాలు తెలియవలసి ఉంది. న్యూజీలాండ్‌లోని క్రైస్ట్ చర్చ్‌లో ముస్లింల పవిత్ర ప్రార్థనా స్థలమైన మసీదులో జొరబడి, నరమేధాన్ని సృష్టించిన ఘటన జరిగిన మూడు రోజుల్లో ఈ ఘటన జరగడంతో అక్కడి అధికారులు అప్రమత్తం అయ్యారు.
Read Also : మాల్యాకు మాగుంటకు లింకేటి? వైసీపీపై ట్రోలింగ్