America Shooting : అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం.. ముగ్గురు మృతి

అమెరికాలో కాల్పులు విపరీతంగా పెరిగాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు తిరిగి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది.

America New Mexico : అమెరికాలో వరుసగా కాల్పులు ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా యూఎస్ లో మళ్లీ కాల్పులు కలకలం రేపాయి. న్యూ మెక్సికోలోని పాఠశాల దగ్గర జరిగిన కాల్పుల్లో ముగ్గురు మృతి చెందగా మరో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. అనుమానితుడిని సంఘటనా స్థలంలోనే హతమార్చినట్లు ఫార్మింగ్ టన్ పోలీసు విభాగం ఫేస్ బుక్ పోస్టులో పేర్కొంది. ఈ కాల్పుల్లో గాయాలకు గురైన ఇద్దరు చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు.

సంఘటనపై దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు. ఘటన తర్వాత స్కూల్ ను మూసివేశారని, మధ్యాహ్నం తర్వాత మళ్లీ తెరిచేందుకు అనుమతి ఇచ్చారని వెల్లడించారు. విద్యార్థులు, సిబ్బంది సురక్షితంగా ఉన్నారని తెలిపారు. కాల్పులకు కారణం తెలియరాలేదన్నారు. అమెరికాలో కాల్పులు విపరీతంగా పెరిగాయి. ఇంటి నుంచి బయటకు వెళ్లినవారు తిరిగి క్షేమంగా వస్తారన్న నమ్మకం లేకుండా పోయింది.

US Texas Firing : అమెరికాలో కాల్పులు .. రంగారెడ్డి జిల్లా కోర్టు జడ్డి కుమార్తె మృతి

ఎందుకు కాల్పులు జరుగుతున్నాయో తెలియలని దుస్థితి నెలకొంది. ఈ కాల్పులకు గురవుతున్నవారిలో భారతీయులు సైతం ఉండటం ఆందోళన గురి చేస్తోంది. పుట్టిన దేశాన్ని వదిలి ఉన్నత చదువులు, ఉద్యోగాల పేరుతో అమెరికా బాటపట్టి విగతజీవులుగా స్వదేశానికి తిరిగి వస్తున్నారు. ప్రభుత్వేతర సంస్థ గన్ వయలెన్స్ ఆర్కైన్ ప్రకారం.. అమెరికాలో 2023లో 215కు పైగా కాల్పుల ఘటనలు చోటు చేసుకోవడం గమనార్హం.

ట్రెండింగ్ వార్తలు