Ukraine fighter jet planes collided
Ukraine Two Fighter planes Collided : యుక్రెయిన్ లోని కీవ్ సమీపంలో గాలిలో ఎగురుతున్న రెండు ఎల్ -39 శిక్షణా విమానాలు ఢీకొట్టడంతో ముగ్గురు యుక్రెయన్ పైలెట్లు మృతి చెందారు. కీవ్ కు పశ్చిమాన ఉన్న జైటోమిర్ ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పశ్చిమ దేశాల నుంచి తీసుకున్న ఫైటర్ జెట్స్ పై శిక్షణ ఇచ్చేందుకు యుక్రెయిన్ భారీ కసరత్తుకు సిద్ధమవుతోంది.
ప్రమాదంలో మరణించిన ముగ్గురు మిలటరీ పైలట్లలో యుక్రెయిన్ ఆర్మీ ఆఫీసర్ అండ్రీ పిల్షికోవ్ ఉన్నారు. ఆయన దేశానికి అంకితభావంతో సేవ చేశారని యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ తెలిపారు. పశ్చిమ దేశాల నుంచి వచ్చి ఎఫ్-16 ఫైటర్ జెట్స్ ను ఎగురవేయడానికి యుక్రెయిన్ సైనికులకు శిక్షణ ఇవ్వాలని చూస్తున్నారు. ముగ్గురు పైలెట్ల మృతి కోలుకోలేని నష్టమని తెలిపారు.
బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఇది భరించలేని నష్టమని వెల్లడించారు. ఫిబ్రవరి 2022లో యుక్రెయిన్ పై రష్యా సైనిక చర్యల తర్వాత రెండు దేశాల సైన్యాలు క్రమం తప్పకుండా పరస్పరం దాడులు చేసుకుంటూనేవున్నాయి.
మొదట్లో వెనుకబడిన యుక్రెయిన్, పాశ్చాత్య దేశాల సైనిక సహాయంతో రష్యాకు వ్యతిరేకంగా యుక్రెయిన్ సైన్యం పోరాడుతోంది. దీని ఫలితమే ఈ యుద్ధంలో యుక్రెయిన్ రష్యాపై ఆధిపత్యం చెలాయించేలా తెలుస్తోంది.