UK Embassy In Delhi: దెబ్బకు దెబ్బ.. ఢిల్లీలోని బ్రిటన్ ఎంబసీ ముందు బారీకేడ్ల తొలగింపు

ఇదే విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లండన్‭లోని భారత హైకమిషనరేట్ ముందున్న త్రివర్ణ పతాకాన్ని తొలగించే ప్రయత్నం జరిగిన చాలా తరువాత లండన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాస్తవానికి ఇదే భారత్‭కు కోపాన్ని తెప్పించింది.

UK Embassy In Delhi: కొద్ది రోజుల క్రితం బ్రిటన్ రాజధాని లండన్‭లో ఉన్న భారత హైకమిషనరేట్ ముందు ఉన్న త్రివర్ణ పతాకాన్ని ఖలిస్తానీ మద్దతుదారులు తొలగించే ప్రయత్నం చేసిన విషయం తెలిసిందే. త్రివర్ణ పతాకాన్ని తొలగించి ఖలిస్తానీ జెండా ఎగరవేద్దామనుకున్నారు కానీ, ఆ ప్రయత్నం పూర్తిగా విఫలమైంది. అయితే ఈ చర్యలో ఖలిస్తానీ మద్దతుదారుల అరాచకత్వం కనిపిస్తూనే ఉన్నప్పటికీ, బ్రిటన్ ప్రభుత్వం నిర్వహణాలోపం కూడా స్పష్టంగానే తెలుస్తోంది. లండన్‭లో భారత్‭కు జరిగిన ఈ అవమానానికి ప్రతిచర్య బలంగానే తగిలింది. ఢిల్లీలోని బ్రిటన్ ఎంబసీ ముందున్న బారీకేడ్లను తాజాగా తొలగించారు.

Controversial Posters : ఢిల్లీలో ప్రధాని మోదీపై వివాదాస్పద వ్యాఖ్యలతో పోస్టర్ల కలకలం

బహుశా.. దీన్ని దెబ్బకు దెబ్బ అన్న చందంగా కొందరు వర్ణిస్తున్నారు. చాణక్యపురి ఎంబసీ ఎన్‌క్లేవ్‌లోని శాంతిపథ్ వద్ద బ్రిటన్ మిషన్ వెలుపల ఉంచిన బారికేడ్‌లు, రాజాజీ మార్గ్‌లోని బ్రిటిష్ హైకమిషనర్ అలెక్స్ ఎల్లిస్ నివాసం వరకు తొలగించారు. ఆదివారం నాడు లండన్‌లోని భారత హైకమిషన్ వెలుపల జరిగిన హింసాత్మక నిరసనపై ప్రభుత్వ అత్యున్నత స్థాయి అంచనాను అనుసరించి ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ చర్యపై ఇండియాలోని బ్రిటన్ హైకమిషనర్ స్పందిస్తూ తాము భద్రతా విషయాలపై వ్యాఖ్యానించమని అన్నారు.

Pakistan Earthquake : వామ్మో.. మరీ ఇంత ధైర్యమా..! భూకంపానికి భవనం ఊగుతున్నా వార్తలు చదిన యాంకర్.. వీడియో వైరల్

కాగా, ఇదే విషయమై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. లండన్‭లోని భారత హైకమిషనరేట్ ముందున్న త్రివర్ణ పతాకాన్ని తొలగించే ప్రయత్నం జరిగిన చాలా తరువాత లండన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. వాస్తవానికి ఇదే భారత్‭కు కోపాన్ని తెప్పించింది. ఖలిస్తాన్ అనుకూల కార్యకర్తల నుంచి మరిన్ని నిరసనలు హింసాత్మకంగా మారే అవకాశాలపై బ్రిటన్ అధికారులతో భారత ఇంటెలిజెన్స్ విభాగం చర్చించినట్లు తెలుస్తోంది. ఖలిస్తాన్ అనుకూల వ్యక్తులు హైకమిషన్ ప్రాంగణంలోకి ప్రవేశించడానికి అనుమతించడంపై భారత్ వివరణ కోరింది. ప్రతి ఒక్కరిని గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలని బ్రిటన్ ప్రభుత్వాన్ని కోరింది.

ట్రెండింగ్ వార్తలు