Tokyo Olympics 2020 Wrestler Bajrang Punia Semi-Finals india
Tokyo Olympics 2020 Wrestler Bajrang Punia Semi-Finals india: టోక్యో ఒలింపిక్స్‌లో భారత రెజ్లర్ భజరంగ్ పునియా అదరగొడుతున్నాడు. అద్భుతమైన ప్రదర్శనతో దూసుకెళ్తున్నాడు. పునియా సెమీస్ కు చేరాడు. పురుషుల 65కిలోల విభాగంలో క్వార్టర్స్‌లో 2-1 తేడాతో ఇరాన్‌కు చెందిన గియాసి చెకా మొర్తజాను మట్టికరిపించాడు. తొలి రౌండ్‌లో భజరంగ్‌పై 0-1 తేడాతో ప్రత్యర్థి గియాసి పైచేయి సాధించినా.. రెండో రౌండ్‌లో అద్భుతంగా పుంజుకున్న భజరంగ్ మ్యాచ్‌ను తనపైపు తిప్పుకున్నాడు.
10 సెకన్లలో మ్యాచ్ ముగుస్తుందనగా భజరంగ్ రెండు పాయింట్లు సాధించడంతో విజేతగా నిలిచాడు. మధ్యాహ్నం మూడు గంటలకు జరిగే సెకండ్ సెమీ ఫైనల్‌లో హాజి అలీయెవ్‌తో తలపడనున్నాడు. ఇక్కడ గెలిస్తే భారత్‌కు మరో పతకం ఖాయమైనట్లే.