Tokyo Olympics Offer : మెడ‌ల్ గెలిస్తే..మాస్క్ లేకుండా ఉండొచ్చు

టోక్యో ఒలింపిక్స్ నిర్వాహకులు అథ్లెట్లకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మెడల్ గెలిస్తే 30 సెకన్ల పాటు మాస్క్ లేకుండా ఉండొచ్చని ప్రకటించారు. కేవలం 30 సెక‌న్ల పాటే ఈ అవ‌కాశం ఇస్తున్నామని..దయచేసిన అంతకు మించిన సమయాన్ని తీసుకోవద్దని కోరారు.

Tokyo Olympics offered mask free for medal winning athletes : జపాన్ రాజధాని టోక్యోలో ఒలింపిక్స్‌ క్రీడలు కొనసాగుతున్నాయి. అటు కరోనా నిబంధనలు పాటిస్తూ..భద్రతా చర్యలు పాటిస్తూ క్రీడల్ని కొనసాగిస్తున్నారు నిర్వాహకులు. కరోనా నియంత్రణ కోసం పటిష్టమైన చర్యలు తీసుకుంటూనే కార్యక్రమాన్ని సమర్థవంతంగా కొనసాగిస్తున్నారు. ఇటు సిబ్బందికి. అటు అథ్లెట్లకు,అధికారులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీంట్లో భాగంగా ప్లేయ‌ర్స్ ఆడేట‌ప్పుడు త‌ప్ప మిగ‌తా అన్ని స‌మ‌యాల్లో మాస్కులు ధ‌రించే ఉండాల‌ని స్ప‌ష్టం చేశారు. అయితే తాజాగా మెడ‌ల్ గెలిచిన వాళ్ల‌కు మాత్రం ఓ బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చారు. విజేతలు పోడియంపై నిల్చున్న స‌మ‌యంలో ఫొటోల‌కు పోజులివ్వ‌డానికి 30 సెక‌న్ల పాటు మాస్కులు తీసివేసే అవ‌కాశాన్ని క‌ల్పించారు.

కానీ ఇలా విజేతలకు ఇచ్చిన అవకాశాన్ని దుర్వినియోగం చేసుకోవద్దని సోమ‌వారం (జులై 26,2021) ఇంట‌ర్నేష‌న‌ల్ ఒలింపిక్ క‌మిటీ అధికార ప్ర‌తినిధి మార్క్ ఆడ‌మ్స్ కోరారు. కేవలం 30 సెక‌న్ల పాటే ఈ అవ‌కాశం ఇస్తున్న‌ామని..దయచేసిన అంతకు మించిన సమయాన్ని తీసుకోవద్దని కోరారు.
కరోనా జాగ్రత్తల్లో భాగంగా..ప్ర‌స్తుతం అథ్లెట్ల‌కు ప్రతీరోజూ ప‌రీక్షలు నిర్వ‌హిస్తున్నారు. ఇక నుంచి మెడ‌ల్స్ గెలిచిన వాళ్లు పోడియంపై నిల్చున్న స‌మ‌యంలో నిర్వాహ‌కులు చెప్పిన‌ప్పుడు ఫొటోల కోసం మాస్కులు తీయ‌వ‌చ్చు. కాగా..ఐదు ఖండాలకు చెందిన క్రీడాకారులు ఆయా దేశాలకు చెందినవారు వారి వారి ఆటల్లో ప్రతిభ కనబరిచి పతకాలు సాధించిన వారు పోడియంపై పతకాలను అందజేసిన సమయంలో ఫోటోలు తీయించుకోవటానికి ఈ అవకాశాన్ని కల్పించారు.

ఆయా దేశాలకు చెందిన క్రీడాకారులు విజయం సాధించి మెడల్ ను తమ దేశానికి చూపించుకోవటానికి..సదరు క్రీడాకారులు స్పష్టంగా కనిపించటానికి ఈ సౌకర్యం ఉంటుంది. పోడియం మీద నిలబడి పతకాన్ని తీసుకోవటానికి క్రీడాకారులు కొన్నేళ్లుగా శ్రమపడుతుంటారు. ఒలింపిక్స్ లో పాల్గొని పతకం తీసుకుంటే ఆ క్రీడాకారుడు జీవితంలో అది చాలా పెద్ద్ ఎచీవ్ మెంట్ అనే విషయం ప్రత్యేకించి చెప్పనక్కరలేదే. అటువంటి ఆ మధుర క్షణాల కోసం ప్రతీ క్రీడాకారుడు తపించిపోతాడు. కలలు కంటాడు. ఆ కలలు సాకారం చేసుకోవటానికి ఎంతో కష్టపడతాడు.తన దేశం పరువు ప్రతిష్టలు పెంచాలని ఉవ్విళ్లూరతాడు. ఒలింపిక్స్ పోడియం నిలిచి పతకం తీసుకునే ఈ క్రీడాకారుడి భావోద్వేగం మాటల్లో చెప్పలేనిది.

ఆ క్రీడాకారుడి దేశం గర్వపడేలా చేసిన తన జీవితం ధన్యమైందని భావిస్తాడు. ఒలింపిక్స్ క్రీడలు ప్రతీ క్రీడాకారుడి లక్ష్యం. అటువంటి ఒలింపిక్స్ క్రీడల్లో పోడియం నిలబడి పతకం తీసుకునే క్షణాలు ఎంతో మధురమనవి..ఉద్వేగ భరితమైనవని ప్రత్యేకించి చెప్పనక్కరలేదు. అటువంటి మధురమైన అద్భుతమైన క్షణాలు మాస్కుతో కప్పబడి ఉండటం అంటే కాస్త ఇబ్బంది కలిగించేదనే చెప్పాలి. సరిగ్గా ఇలాగే ఆలోచించిన టోక్యో ఒలింపిక్స్ లో పోడియం మీద నిలబడిన 30 సెకన్లు మాస్కు పెట్టుకోకుండా ఉండేలా నిర్ణయం తీసుకున్నారు. కాగా మనదేశానికి చెందిన మీరాభాయి ఛాను వెయిట్ లిప్టింగ్ లో పతకాన్ని గెలిచేనాటికి ఈ ప్రకటన వెలువడలేదు. అందుకే మీరాభాయి పతకం తీసుకునేటప్పుడు మాస్క్ ధరించే ఉంది.ఆమెతో పాటు మరో ఇద్దరు కూడా మాస్కు ధరించే ఉన్నారు.

ట్రెండింగ్ వార్తలు