×
Ad

Trump Gold Card: ట్రంప్ గోల్డ్ కార్డ్ వీసాపై చర్చ… అసలు గ్రీన్ కార్డు వల్ల లాభాలేంటి?

అమెరికాలోని ఏ రాష్ట్రమైనా, నగరంలోనైనా నివసించే స్వేచ్ఛ ఉంటుంది. ఉద్యోగం చేసే ప్రాంతం లేదా ఏదో ఒక ప్రాంతంలోనే ఉండనవసరం లేదు.

Trump Gold Card

Trump Gold Card: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ “గోల్డ్‌ కార్డ్‌” విక్రయాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. విదేశీయులు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లిస్తే వారికి యూఎస్‌లో ఉండేందుకు చట్టబద్ధ హోదా కల్పించడంతో పాటు ఆ తర్వాత పౌరసత్వం పొందే అవకాశాన్ని ఈ పథకం కల్పిస్తోంది.

“గోల్డ్‌ కార్డ్‌” వల్ల పొందే టాప్ 10 ప్రయోజనాలు ఇవే..

శాశ్వత నివాస హక్కు: అమెరికాలో ఎప్పటికీ నివసించే, ఉద్యోగం చేసుకునే అవకాశాలు కల్పిస్తుంది. తాత్కాలిక వీసా ఇబ్బందుల నుంచి బయటపడేలా ఉంటుంది.

వీసా టెన్షన్లు లేకుండా ఉద్యోగం చేసుకోవచ్చు: వేరే వర్క్‌ వీసా అవసరం లేకుండా అమెరికాలో అనేక రంగాల్లో పని చేసే అవకాశం. ఫెడరల్‌ ఉద్యోగాలకు కూడా అర్హత ఉంటుంది. ఫెడరల్‌ అంటే అమెరికా కేంద్ర ప్రభుత్వ వ్యవస్థ.

ఎక్కడైనా నివసించొచ్చు: అమెరికాలోని ఏ రాష్ట్రమైనా, నగరంలోనైనా నివసించే స్వేచ్ఛ ఉంటుంది. ఉద్యోగం చేసే ప్రాంతం లేదా ఏదో ఒక ప్రాంతంలోనే ఉండనవసరం లేదు.

కుటుంబ స్పాన్సర్: గోల్డ్‌ కార్డ్‌ పొందిన వ్యక్తి తన భార్య, పిల్లలు, తల్లిదండ్రులు, సోదరులకు గ్రీన్‌కార్డు దరఖాస్తు చేయించే అవకాశం ఉంటుంది.

Also Read: ట్రంప్ గోల్డ్ కార్డ్‌తో రూ.9 కోట్లు పెడితే గ్రీన్ కార్డు వచ్చేస్తుందా?

విద్యా ప్రయోజనాలు: ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో ట్యూషన్‌ ఫీజు, కొన్ని రకాల ఆర్థిక సాయం అందే అవకాశాలు వస్తాయి. అందులో చదువుకునే వారికి తక్కువ ఫీజు విధించే విధానాన్ని అమెరికా అమలు చేస్తుంది.

సోషల్‌ సెక్యూరిటీ, మెడికేర్: అవసరమైన నివాస కాలం పూర్తయ్యాక సోషల్‌ సెక్యూరిటీ, మెడికేర్‌ ప్రయోజనాలకు అర్హత పొందుతారు. మెడికేర్‌ అంటే అమెరికాలో ప్రభుత్వ వైద్య సేవల పథకం.

ప్రయాణ సౌలభ్యం: అమెరికాలోని రాష్ట్రాలతో పాటు విదేశాలకు సులభంగా ప్రయాణించే అవకాశం ఉంటుంది. సాధారణంగా ఎక్కువ కాలం విదేశాల్లో ఉంటే రీ ఎంట్రీ పర్మిట్‌ అవసరం. గోల్డ్‌ కార్డ్‌ ఉంటే అటువంటి పర్మిషన్లు తీసుకునే అవసరం తప్పుతుంది.

పౌరసత్వం పొందే అవకాశం: అమెరికాలో పౌరసత్వం పొందేందుకు చేసుకునే దరఖాస్తులో ప్రధాన తొలి దశగా ఉపయోగపడుతుంది.

ఆస్తి, బ్యాంకింగ్: ఇల్లు కొనడం, లోన్లు, బ్యాంకింగ్ ప్రక్రియలు సులభతరం అవుతాయి.

భద్రత: డిపోర్టేషన్‌ భయం తగ్గుతుంది. తీవ్రమైన నేరాలను చేస్తేనే డిపోర్టేషన్ ఎదుర్కొంటారు. డిపోర్టేషన్‌ అంటే దేశం నుంచి బలవంతంగా పంపించే చర్య.