World Richest Person : 2022 ఏడాది చివరిలో ప్రపంచంలో టాప్ 10 సంపన్నులు వీరే.. ఇండియాలో..

2023 సంవత్సరంలో అడుగుపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. సంపన్నులు ఈ ఏడాది లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నారు. 2022 సంవత్సరంలో మొదటి నుంచి చివరి వరకు ప్రపంచంలో టాప్ 10 సంపన్నుల జాబితాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్య రీతిలో బెర్నార్డ్ అర్నాల్ట్ ప్రపంచ బిలియనీర్ గా స్థానం దక్కించుకున్నారు.

Indian billionaires

World Richest Person: 2022 సంవత్సరంలో మరొక్క రోజే మిగిలి ఉంది. 2023 సంవత్సరంలో అడుగుపెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు సిద్ధమయ్యారు. సంపన్నులు ఈ ఏడాది లాభనష్టాలపై బేరీజు వేసుకుంటున్నారు. 2022 సంవత్సరంలో మొదటి నుంచి చివరి వరకు ప్రపంచంలో టాప్ 10 సంపన్నుల జాబితాలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి. అనూహ్య రీతిలో బెర్నార్డ్ అర్నాల్ట్ ప్రపంచ బిలియనీర్ గా స్థానం దక్కించుకున్నారు. భారత్ నుంచి గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నాడు. 2022 సంవత్సరం ముగియనున్న నేపథ్యంలో ఈ ఏడాది చివరిలో ప్రపంచంలో టాప్ 10 సంపన్నుల జాబితాను బ్లూమ్‌బెర్గ్ విడుదల చేసింది. ఈ జాబితాలో ప్రపంచంలో టాప్10 సపన్నులు , ప్రపంచంలో టాప్ 10 సపన్నులు (మహిళల విభాగంలో) ఎవరున్నారనేది పేర్కొంది. అదేవిధంగా ఇండియాలో టాప్ 10 సపన్నుల జాబితాను వెల్లడించింది.

Gautam Adani the world’s second richest man: ప్రపంచ కుబేరుల్లో రెండో స్థానానికి చేరుకున్న గౌతమ్‌ అదానీ

ప్రపంచంలో టాప్10 సంపన్నులు వీరే..

2022 ఏడాది చివరిలో.. ప్రపంచంలో టాప్10 సపన్నుల జాబితా విభాగంలో బెర్నార్డ్ అర్నాల్ట్ ( 180.9 బిలియన్ డాలర్లు) తొలి స్థానంలో నిలిచారు. ఎలన్ మస్క్ ( 146.5 బిలియన్ డాలర్లు) రెండో స్థానంలో నిలిచాడు. మూడో స్థానంలో ఇండియాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ చోటు దక్కించుకున్నాడు. అతని ఆస్తుల విలువ 127 బిలియన్ డాలర్లు. నాల్గో స్థానంలో జెఫ్ బెజోస్ (108.5 బిలియన్ డాలర్లు). ఐదవ స్థానంలో వారెన్ బఫెట్ (106.3 బిలియన్ డాలర్లు), 6వ స్థానంలో బిల్ గ్రేట్స్ (103.5 బిలియన్ డాలర్లు), 7వ స్థానంలో లారీ ఎల్లిసన్ (101.4 బిలియన్ డాలర్లు), 8వ స్థానంలో ముఖేష్ అంబానీ (89 బిలియన్ డాలర్లు), 9వ స్థానంలో కార్లోస్ స్లిమ్ (83.4 బిలియన్ డాలర్లు), 10వ స్థానంలో స్టీవ్ బాల్మెర్ (78.2 బిలియన్ డాలర్లు).

మహిళల జాబితాలో టాప్10 సంపన్నులు వీరే..

1. ఫ్రాంకోయిస్ బెటెన్‌కోర్ట్ మేయర్స్ (72.3 బిలియన్ డాలర్లు),
2. ఆలిస్ వాల్టన్ ( 58.8 బిలియన్ డాలర్లు)
3. జూలియా కోచ్ ( 57.8 బిలియన్ డాలర్లు)
4. జాక్వెలిన్ మార్స్ (38.7 బిలియన్ డాలర్లు)
5. మిరియం అడెల్సన్ ( 31.1 బిలియన్ డాలర్లు)
6. గినా రైన్‌హార్ట్ ( 27.9 బిలియన్ డాలర్లు)
7. మెకెంజీ స్కాట్ ( 25 బిలియన్ డాలర్లు)
8. సుసానే క్లాటెన్ (24.8 బిలియన్ డాలర్లు)
9. ఐరిస్ ఫాంట్‌బోనా (22.1 బిలియన్ డాలర్లు)
10. అబిగైల్ జాన్సన్ (19.9 బిలియన్ డాలర్లు)

ఇండియాలో టాప్10 సంపన్నులు వీరే..

గౌతమ్ అదానీ ( 127.6 బిలియన్ డాలర్లు)
ముఖేష్ అంబానీ (89.5 బిలియన్ డాలర్లు)
శివ నాడార్ (23.9 బిలియన్ డాలర్లు)
సైరస్ పూనావల్ల ( 20.6 బిలియన్ డాలర్లు)
రాధాకృష్ణ దమానీ (18 బిలియన్ డాలర్లు).
సావిత్రి జిందాల్ ( 18 బిలియన్ డాలర్లు)
లక్ష్మీ మిట్టల్ ( 16.1 బిలియన్ డాలర్లు)
దిలీప్ శాంఘ్వీ ( 15.8 బిలియన్ డాలర్లు)
కుమార్ బిర్లా ( 15.4 బిలియన్ డాలర్లు)
సునిల్ మిట్టల్ ( 14.8 బిలియన్ డాలర్లు)