Shocking video: పక్షిపిల్లని వెంటాడి వేటాడి చంపిన భారీ తాబేలు

ఎగరలేకపోతున్న ఓ పక్షిపిల్లని ఓ భారీ తాబేలు వెంటాడి వేటాడి చంపేసింది. తాబేలు అంటే చాలా సాత్వికంగా ఉంటుందని అనుకుంటాం.కానీ పక్షిపిల్లలను అది వేటాడిన తీరు చూస్తే..

Tortoise hunts baby bird in slow-motion : ఓ తాబేలు.అంటే సాత్వికంగా నెమ్మదిగా ఉంటుంది. అటువంటి ఓ తాబేలు ఓ చిన్నపక్షి పిల్లను వెంటాడి మరీ చంపేసింది. తాబేలుని చూస్తే అలా చేస్తుందని అనుకోం.కానీ ఓ చిన్నపక్షి పిల్లలను వెంటాడి మరీ చంపేసింది. పక్షి పిల్ల తల లటుక్కున కొరికి మరీ చంపేసింది.తరువాత ఆ పక్షిపిల్లను అక్కేడ పారేసింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘అయ్యో తాబేలు ఎంతో నిదానంగా అమాకంగా ఉంటుందనుకున్నాం..కానీ ఇంత దారుణంగా ఎగరలేని ముద్దులొలికే పక్షిపిల్లలను ఎలా కొరికిపారేసిందో ’అనుకుంటాం.ఆఫ్రియాతీరంలోని హిందూ మహాసముంద్రంలోని సీషెల్స్ ద్వీప సమూహంలో భాగమైన ప్రేగెట్ ద్వాపంలో ఇది జరిగింది. ఓ పేద్ద తాబేలు ఓ చిన్న పక్షిపిల్లల తలకొరికి చంపిన వీడియోను డిప్యూటీ కన్జర్వేషన్,సస్టెయినబిలిటీ మేనేజర్ అన్నా జోరా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియోలో ఓ జెయింట్ తాబేలు ఓ దుంగపై ఉంది. దాని దగ్గరకు ఓ చిన్న పక్షిపిల్ల వచ్చింది.తాబేలు తలపై దాని చిట్టి ముక్కుతో పొడిచింది.దాంతో ఆ భారీ తాబేలు నెమ్మదిగా కదిలింది. ఆ పక్షిపిల్లలను పట్టుకోటానికి నోరు చాపింది. కానీ పక్షిపిల్ల దొరకలేదు. ఇంకొంచె దూరం వెనక్కి ఎగిరింది. తాబేలు వైపే చూస్తు ఉంది.కానీ తాబేలు దాన్ని వదల్లేదు. ఇంకాస్త పక్షిదగ్గరకు పాకింది.

అలా పాక్కుంటూ పక్షిదగ్గరకు వచ్చేసింది. కానీ పక్షిపిల్ల ఎగరకుండా అక్కడే ఉంది.అలా తాబేలు పాకి పాకి దగ్గరకు వచ్చేసింది. ఈ క్రమంలో తాబేలు ఆ పక్షి పిల్లలను ఏమీ చేయదని..ఆ చిట్టిపిట్టతో ఆడుకుంటోందేమో అనుకుంటాం. కానీ షాకింగ్..ఆ భారీ తాబేలు ఆ చిట్టిపక్షి పిల్లను తలను లటుక్కున పట్టుకుని కొరికిపారేసింది. దీంతో ఆ పక్షి పిల్ల నిర్జీవంగా పడిపోయింది. కానీ ఇది నిజంగా షాకింగ్ ఘటనే. ఎగరలేక అక్కడక్కడే ఉండిపోయిన ఆ చిట్టిపక్షిపిల్లలపై అంత భారీ తాబేలు ఎంత నిర్ధయంగా ప్రవర్తించిందో..పక్షిపిల్ల తలను ఎలా కొరికి పారేసిందో అయ్యో అని అనిపిస్తుంది.

పక్షిపిల్ల తాబేలుతో సరదాగా ప్రవర్తించినప్పటినుంచి తాబేలు దాన్ని కూడా వెంబడించటం ఓ ఆటగా చూస్తున్న సడెన్ గా తాబేలు పక్షిని చంపేసిందని మాత్రం ఊహించలేని ఉత్కంఠగా సాగింది.తాబేళ్లు సాధారణంగా ఆకులు, కూరగాయలు,దుంపలు వంటివి తింటాయి.కానీ అప్పుడప్పుడు చిన్న చిన్న పిట్టల్ని చంపి తింటాయి. తాబేలుకి సాధారణంగా పక్షులు దొరకవు.కానీ ఎగరలేని ఇటువంటి పక్షి పిల్లల్ని,పీతలను తాబేళ్లు పట్టి తింటాయని జంతుశాస్త్రవేత్తలు చెబుతున్నారు. తాబేళ్లు చిన్నచిన్న పక్షుల్ని వేడటాడినట్లు అనేక సంధర్బాల్లో జరిగింది.

కానీ తాబేలు పక్షిని వేటాడి తిటనం అనేది ఇప్పటి వరకూ వీడియోల్లో రికార్డు కాలేదని..గెర్లాచ్ అనే జంతు శాస్త్రవేత్త తెలిపారు. సీషెల్స్ తాబేళ్లు పక్షుల్ని ఎలా వేటాడుతాయో అనే విషయంపై మరింత పరిశోధన చేయాలని అనుకుంటున్నట్లుగా తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు