Hot Air Balloon Crash: మరో ఘోర ప్రమాదం.. కూలిపోయిన హాట్ ఎయిర్ బెలూన్.. 8మంది దుర్మరణం

దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Hot Air Balloon Crash: బ్రెజిల్ లో ఘోర ప్రమాదం జరిగింది. హాట్ ఎయిర్ బెలూన్ కూలిపోయింది. ఈ ఘటనలో 8మంది టూరిస్టులు మరణించారు. ప్రమాదం సమయంలో హాట్ ఎయిర్ బెలూన్ లో మొత్తం 21 మంది పర్యాటకులున్నారు. బ్రెజిల్ లోని దక్షిణ రాష్ట్రం శాంటా కాటరినాలో ఈ దుర్ఘటన జరిగింది.

శనివారం తెల్లవారుజామున టూరిజం హాట్ ఎయిర్ బెలూన్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. చూస్తుండగా బెలూన్ కాలిపోతూ కూలిపోయింది. ప్రియా గ్రాండే నగరంలో బెలూన్ కూలిందని అగ్నిమాపక శాఖ సిబ్బంది తెలిపింది. ఈ ప్రమాదంలో 13మంది ప్రాణాలతో బయటపడ్డారు. వెంటనే వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Also Read: మీరు ఏ రోజు చనిపోతారో ఊహించగలరా? మీ పుట్టిన రోజున మీరు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని తెలుసా..! అధ్యయనంలో షాకింగ్ విషయాలు

గాల్లో ఉండగానే ప్రమాదం జరిగింది. హాట్ ఎయిర్ బెలూన్ లో మంటలు వచ్చాయి. ఆ తర్వాత అది నేల కూలింది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విహారయాత్ర కాస్తా విషాదయాత్రగా మారింది. గాల్లో తేలుతు ఎంజాయ్ చేయాలని టూరిస్టులు ఆశించారు. గాల్లో
విహరిస్తూ థ్రిల్ ను అనుభూతి పొందాలనుకున్నారు. కానీ, ఊహించని విధంగా ప్రమాదం జరిగింది. ఏకంగా 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటన స్థానికంగా కలకలం రేపింది.