Birthday Death: మీరు ఏ రోజు చనిపోతారో ఊహించగలరా? మీ పుట్టిన రోజున మీరు చనిపోయే అవకాశం ఎక్కువగా ఉందని తెలుసా..! అధ్యయనంలో షాకింగ్ విషయాలు
పుట్టిన రోజు నాడే చావు ఎందుకు పలకరిస్తుంది? అనేదానికి కారణాలను కూడా విశ్లేషించే ప్రయత్నం చేశారు అధ్యయనకర్తలు.

Birthday Death: మరణం.. ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరికీ తెలియదు. సడెన్ గా వస్తుంది. ప్రాణాలు తీస్తుంది. చిన్న, పెద్ద.. ధనిక, పేద.. ఆరోగ్యవంతులు, రోగులు.. అనే తేడా లేదు. చావు ఎప్పుడైనా ఎవరినైనా ఎలా అయినా పలకరించవచ్చు. మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరూ చెప్పలేరు. కనీసం ఊహించను కూడా లేరు.
అయితే, ఓ అధ్యయనంలో షాకింగ్ విషయాలు వెలుగుచూశాయి. పుట్టిన రోజు నాడు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు ఆ ఆధ్యయనంలో వెల్లడైంది. పుట్టిన రోజు నాడే చావు ఎందుకు పలకరిస్తుంది? అనేదానికి కారణాలను కూడా విశ్లేషించే ప్రయత్నం చేశారు అధ్యయనకర్తలు. అసలు మిగతా రోజుల్లో కాకుండా బర్త్ డే రోజునే చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉండటానికి కారణాలు ఏంటో కూడా ఆ ఆధ్యయనంలో వివరించే ప్రయత్నం చేశారు.
అధ్యయనం ప్రకారం.. మనం పెద్దయ్యాక జరుపుకునే పుట్టిన రోజు వేడుకలు మనలో భావోద్వేగాలను రేకెత్తిస్తాయి. మనం మరో జీవిత సంవత్సరాన్ని జరుపుకోవాలా లేదా మరణం గురించి నిశ్శబ్దంగా ఆలోచించాలా? ఈ భావోద్వేగాలే.. పుట్టినరోజు నాడు ఒక రకమైన ప్రభావం చూపిస్తాయని, ఇది వారి పుట్టిన రోజున సమయంలో లేదా దానికి సమీపంగా ఉండే తేదీల్లో మరణించే అవకాశాలు ఎక్కువగా ఉండటానికి కారణం అంటున్నారు.
సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురితమైన 2012 అధ్యయనం ప్రకారం, ఇతర రోజులతో పోలిస్తే, 60 ఏళ్లు పైబడిన వారి పుట్టినరోజున మరణించిన వారి సంఖ్య 13.8 శాతం పెరిగింది. అంతే కాదు సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురితమైన 2015 అధ్యయనం ప్రకారం, ఇతర రోజుల కంటే పుట్టినరోజున మరణించే ప్రమాదం 6.7 శాతం ఎక్కువగా ఉంది.
Also Read: జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, ఒత్తిడి .. పిల్లలకు యోగా ఒక వరం.. ఏ ఏ ఆసనం దేనికి మంచిదంటే?
అసలు బర్త్ డేకి, చావుకి లింక్ ఏంటి?
* బర్త్ డే అంటే జాలీ డే. సెలబ్రేషన్స్ డే. ఆరోజు ఫుల్ గా ఎంజాయ్ చేయాలని అంతా భావిస్తారు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ తో పార్టీలు చేసుకుంటారు. కొందరు ఫుల్లుగా మద్యం తాగేసి మత్తులో జోగుతారు. ఈ తరహా సెలబ్రేషన్ ఇప్పుడు సమస్యకు కారణం అవుతోందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. అతి మద్యం సేవించడం, అతిగా ఆలోచన చేయడం.. పుట్టిన రోజున మరణించే అవకాశాలు పెరగడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.
* తరచుగా పుట్టినరోజు వేడుకలను ఎంతో ఆడంబరంగా జరుపుకుంటారు. చాలా మంది మద్యం, ఇతర పదార్థాలతో సెలబ్రేషన్స్ జరుపుకుంటారు. అదే.. మరణానికి కారణం అవుతోంది. మద్యం తాగి వాహనాలు నడపడం, ఇతర ప్రమాదాలు మరణాల ప్రమాదాన్ని పెంచుతున్నాయి.
* ప్రాణాంతక వ్యాధులతో బాధపడే వారు పుట్టినరోజు నాడు మరణించే అవకాశాలు ఎక్కువ.
* పుట్టినరోజులు ఒక రకమైన దుఃఖాన్ని రేకెత్తిస్తాయి. నెరవేరని అంచనాలు, ఒంటరితనం, వృద్ధాప్యం, ఒత్తిడి కలగజేస్తాయి. విచారం, నిరాశకు దారితీస్తుంది. సైన్స్ డైరెక్ట్‌లో ప్రచురించబడిన 2016 అధ్యయనం ప్రకారం, ఈ భావోద్వేగాలు ఆత్మహత్య ప్రమాదాన్ని రేకెత్తిస్తాయి. ఇతర రోజులతో పోలిస్తే, వారి పుట్టినరోజులలో వ్యక్తులలో ఆత్మహత్య ప్రమాదం 50% ఎక్కువగా ఉందని అధ్యయనం గమనించింది.
ఏది ఏమైనా పుట్టినరోజు చూపే ప్రభావంపై మరింత అవగాహన కోసం ఇంకా ఎక్కువ పరిశోధన చేయాల్సిన అవసరం అని అధ్యయనకర్తలు చెబుతున్నారు. ఒకటి మాత్రం నిజం. భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. అతిగా మద్యం సేవించే అలవాటు మానుకోవాలి. జీవితంలోని ముఖ్యమైన, మధురమైన క్షణాలను గుర్తు చేసుకుని ముందుకు సాగాలి అని అధ్యయనకర్తలు స్పష్టం చేశారు.