Toys Rain in Football Stadium: ఫుట్‌బాల్ స్టేడియంలో బొమ్మల వర్షం..ఎందుకో తెలిస్తే హ్యాట్సాఫ్ అంటారు

ఓ ఫుట్‌బాల్ స్టేడియంలో బొమ్మలు వర్షంలా కురిసాయి..ఆట చూడటానికి వచ్చిన అభిమానులు ఒక్కసారిగా బొమ్మల్ని స్టేడియంలోకి విసిరారు.ఆ బొమ్మల్ని ఎందుకు విసిరారంటే..

Toys Rain In Football Stadium

Toys Rain in Football Stadium : స్పెయిన్‌లో టాప్ ఫ్లైట్ ఫుట్‌బాల్ స్టేడియంలో హార్ట్ టచ్ చేసే సీన్ జరిగింది. క్రీడాకారులు,అభిమానులతో మారుమ్రోగే స్టేడియంలో బొమ్మల వర్షం కురిసింది. స్టేడియంలో అప్పటివరకూ ఓ లెక్క… ఆ కొన్ని అరుదైన క్షణాలు మరో లెక్క అన్నట్లుగా ఒక్కసారిగా మైదానం ఫ్యాన్స్ కేరింతలతో మారుమోగింది. బొమ్మలు వర్షంలా కురిసాయి. హార్ట్ టచ్చింగ్ గా అనిపించే ఆ దృశ్యం చూసి తీరాల్సిందే! భారీ సంఖ్యలో స్టేడియంలోకి వచ్చిన అభిమానులు ఒక్కసారిగా బొమ్మల్ని స్టేడియంలోకి విసిరారు. అలా వేలాదిగా వచ్చి పడ్డ బొమ్మలతో బొమ్మల వర్షంగా మారింది స్టేడియం అంతా..బొమ్మల్ని అలా ఎందుకు విసిరారు?వాటిని ఏం చేస్తారు? అసలిదంతా ఏంటీ అంటే..మంచి కారణమే ఉంది ఈ కార్యక్రమం వెనుక..

Read more : Telangana Govt with Kotelijent‌ : టాలెంట్ ఉంటే ఉద్యోగాలు వెతుక్కుంటు వస్తాయి : మత్రి కేటీఆర్

స్పెయిన్‌లో టాప్ ఫ్లైట్ ఫుట్‌బాల్ క్లబ్ రియల్ బెటిస్ అనే స్టేడియం ప్రత్యేకమైనది. ప్రతీ సంవత్సరం క్రిస్మస్ వస్తున్న సమయంలో… ముందుగా ఓ రోజున ఆ క్లబ్ ఇచ్చే పిలుపుతో అభిమానులు భారీగా తరలివస్తారు. ఫుట్‌బాల్ మైదానంలోకి పిల్లలకు నచ్చే టెడ్డీ బేర్లు, బొమ్మలను వేల సంఖ్యలో విసిరేస్తారు అభిమానులు. అలా విసిరేటప్పుడు అదో వర్షంలా కనిపించి కనువిందు చేస్తుంది. ఆటగాళ్లు సీరియస్ గా ఆడే స్టేడియంలో చిన్నారులు ఎంతో ఇష్టపడే బొమ్మలు ఎటు చూసినా కనిపిస్తాయి. ఆ దృశ్యం చూసి తీరాల్సిందే అనిపిస్తుంది.

ఎందుకిలా చేస్తారంటే..
ఇలా బొమ్మలు విసరడానికి ఓ చక్కటి మానవతా కోణం ఉంది. అభిమానులు ఇచ్చే ఈ బొమ్మల్ని ఫుట్ బాల్ క్లబ్.. దివ్యాంగులైన పిల్లలకు అందిస్తుంది. రోజూ కష్టాలతో తమ జీవితాన్ని భారంగా గడిపే ఆ చిన్నారులకు ఈ బొమ్మలు ఒకింత ఉపశమనం కలిగించాలనే ఆలోచనతో వచ్చిందే ఈ బొమ్మల వాన. తమ కోసం ఎవరో అవి గిఫ్టుగా ఇచ్చారని ఆ చిన్నారులు ఆనందించాలని వారి అమాయకపు మోముల్లో చిన్న చిరునవ్వు చూడాలని ఇలా క్లబ్ రియల్ బెటిస్ ప్రారంభించింది. ఆ చిన్ని హృదయంలో ఆ బొమ్మలు సంతోషాన్ని నింపుతుంది. ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది.

Read more : Seoul Milk : మ‌హిళ‌ల‌ను ఆవులుగా చూపిస్తూ ప్రకటన..వివాదంగా మారిన వీడియో

ఈ సంవత్సరం కూడా ఈ సంప్రదాయం కొనసాగింది. రియల్ సోసీడాడ్ ఆట మధ్యలో విరామ సమయంలో… ఈ బొమ్మల వర్షం కురిసింది. 1935 నుంచి ఆ క్లబ్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది. కానీ ఏ ఏడాది కూడా రానన్ని బొమ్మలొచ్చాయట ఏ సంవత్సరం. ఆట చూసేందుకు అభిమానులు వచ్చే ముందే… చిన్న బొమ్మలతో రమ్మని క్లబ్ పిలుపు ఇచ్చింది. వాటి సైజ్ 35 సెంటీమీటర్లు దాటకూడదని..వాటికి బ్యాటరీలు కూడా ఉండకూడదని సూచించింది. అలాగే అన్ని సూచనలనూ అభిమానులు పాటించారు. అటువంటి బొమ్మలే తెచ్చారు. బెనిటో విల్లామార్లన్ స్టేడియంలో 52,158 మంది ఉన్నారు. వారిలో 19వేల మందికి పైగా బొమ్మల్ని విసిరారు. ఈ బొమ్మల వానతో పాపుల రక్షకుడు జీసస్ జన్మదినం అయిన క్రిస్మస్ వేడుక ముందే వచ్చేనట్లైంది.