Elderly Commits Crimes : అయ్యో పాపం.. ఈ అవ్వకి ఎంత కష్టం వచ్చింది..! జైల్లో ఉండేందుకు నేరాలు చేస్తుందట..

జపాన్‌లోని అతిపెద్ద మహిళా జైలు తోచిగి ఉమెన్స్ జైల్లో అకియోను ఉంచారు. ఇందులో దాదాపు 500 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు.

Elderly Commits Crimes : జపాన్ లో వృద్ధుల పరిస్థితి దయనీయంగా ఉంది. వారిని పట్టించుకునే వారే కరువయ్యారు. నిలువు నీడ లేక వృద్ధులు బాధలు పడుతున్నారు. తిండి కోసం, గూడు కోసం ఇబ్బందులు పడుతున్నారు. అక్కడ వృద్ధుల దయనీయ పరిస్థితికి అద్దం పట్టే ఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ వృద్ధురాలు అదే పనిగా నేరాలు చేసేది. ఎందుకో తెలుసా.. నేరం చేసి జైలుకి వెళ్లాలని. అవును.. జైల్లో చోటు కోసం ఆ పెద్దావిడ ఇలా చేసిందట.

జైల్లో ఉండేందుకు చోటు, తినడానికి తిండి..
ఆమె పేరు అకియో. వయసు 81 సంవత్సరాలు. ముందూ వెనుక ఎవరూ లేరు. తిండికి, ఉండేందుకు చాలా ఇబ్బందిగా మారింది. దాంతో ఆవిడ నేరాలు చేయడం ప్రారంభించింది. అలా అయినా తనను జైల్లో వేస్తే తనకు ఉండేందుకు, తినడానికి ఇబ్బంది ఉండదన్నది ఆమె ఆలోచన. జైల్లో అయితే ఉచితంగా ఉండొచ్చని, టైమ్ కి భోజనం పెడతారట. ఉండటానికి చోటు దొరుకుతుంది, తినడానికి తిండీ దొరుకుతుంది. ఈ ఆలోచనతోనే ఆమె తరుచుగా నేరాలు చేస్తోందట.

Also Read : ఓ మై గాడ్.. ఇతడి జీతం ఎంతో తెలిసి ఏకంగా సీఎం చంద్రబాబే షాకయ్యారుగా.. ఆ తర్వాత ఎంత రచ్చ జరిగిందంటే..

ఆ జైల్లోని ఖైదీల్లో ఎక్కువ మంది వృద్ధులే..
టోక్యోకు ఉత్తరాన ఉన్న జపాన్‌లోని అతిపెద్ద మహిళా జైలు తోచిగి ఉమెన్స్ జైల్లో అకియోను ఉంచారు. ఇందులో దాదాపు 500 మంది ఖైదీలు ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది వృద్ధులు.

ఈ వయసులో ఒంటరిగా బతకడం కష్టం…
ఇలా తరుచుగా నేరాలు చేసి జైలుకి ఎందుకు వెళ్తున్నారు అని అడిగితే.. ”నేను ఆర్థికంగా స్థిరంగా ఉండి, సౌకర్యవంతమైన జీవనశైలిని కలిగి ఉంటే, నేను కచ్చితంగా అలా చేసి ఉండేవాడిని కాదని అకియో తన జైలు శిక్ష గురించి ఎంతో ఆవేదనగా చెబుతారు. ఈ జైల్లో చాలా మంచి వ్యక్తులు ఉన్నారు. బహుశా ఈ జీవితం నాకు అత్యంత స్థిరమైనది” అని అకియో చెబుతుంది.

ఇంట్లో నుంచి కొడుకు గెంటేశాడని కన్నీటిపర్యంతం..
జైలు శిక్షకు ముందు.. అకియో తన 43 ఏళ్ల కొడుకుతో నివసించింది. అయితే, కొడుకు ఆమెను ఇంట్లో ఉండనివ్వలేదు. బయటకు వెళ్లిపోవాలని చెప్పేవాడని కన్నీటి పర్యంతం అయ్యింది. అక్టోబర్ 2024లో జైలు నుంచి విడుదలైన తర్వాత తనకు బాగా భయం వేసిందని, కొడుకు దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియలేదని ఆమె వాపోయింది.

నా కొడుకు నన్ను ఆదరించడు. ఈ వయసులో ఒంటరిగా బతకటం చాలా కష్టం. నేను ఈ పరిస్థితికి వచ్చినందుకు సిగ్గుపడుతున్నాను. ఏమీ చేయలేని వయసు నాది అని అకియో కంటతడి పెట్టారు.

Also Read : వసుంధరకి ఎమ్మెల్యే టికెట్.. బాబు, బాలయ్య మధ్య చర్చలు.. ఫన్నీ ఫన్నీగా..

జపాన్ ప్రభుత్వ డేటా ప్రకారం.. ఆ దేశంలో 2024లో 65 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారి సంఖ్య రికార్డు స్థాయిలో 36.25 మిలియన్లకు చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధాప్యం చెందుతున్న సమాజాలలో ఒకటిగా నిలిచింది. జపాన్ మొత్తం జనాభాలో ఇప్పుడు వృద్ధులు 29.3 శాతం ఉన్నారు. 1,00,000 కంటే ఎక్కువ జనాభా కలిగిన 200 దేశాలు, ప్రాంతాల జాబితాలో వృద్ధ నివాసితుల నిష్పత్తి జపాన్‌ను అగ్రస్థానంలో ఉంచింది.