Train Fire
Bangladesh : బంగ్లాదేశ్‌లోని గోపీబాగ్‌లో ఇంటర్‌సిటీ బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో ఘోర అగ్నిప్రమాదం జరిగింది.బంగ్లాదేశ్‌లోని గోపీబాగ్‌లో ఇంటర్‌సిటీ బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయి. శుక్రవారం రాత్రి 9.05 గంటలకు ఈ అగ్నిప్రమాదం జరిగింది. ఈ రైలులో అయిదు బోగీలు కాలిపోయాయని బంగ్లాదేశ్ రైల్వే అధికారులు చెప్పారు. ఈ ఘోర అగ్నిప్రమాదంలో నలుగురు మరణించారు. మంటలను అదుపు చేయడానికి ఏడు అగ్నిమాపక యూనిట్లను తీసుకువచ్చామని అగ్నిమాపక సేవ మరియు పౌర రక్షణ డ్యూటీ ఆఫీసర్ రకీబుల్ హసన్ చెప్పారు.
ALSO READ : Train Derail : రాజస్థాన్‌లో పట్టాలు తప్పిన ఎక్స్‌ప్రెస్ రైలు
ప్రణాళిక ప్రకారం ఆగంతకులు బెనాపోల్ ఎక్స్‌ప్రెస్ రైలును తగుల బెట్టారని అనుమానిస్తున్నట్లు ఢాకా మెట్రోపాలిటన్ పోలీస్ అదనపు కమిషనర్ (క్రైమ్ అండ్ ఆపరేషన్స్) మహిద్ ఉద్దీన్ చెప్పారు. బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు రెండు రోజుల ముందు ఈ ఘటన జరిగింది. రైలులో నిప్పంటించింది ఎవరు అనేది కచ్చితంగా చెప్పలేమని, అయితే ఇది విధ్వంసకర చర్య అని ఆయన పేర్కొన్నారు.
ALSO READ : Gangster Dawood Ibrahim : దావూద్ ఇబ్రహీం ఆస్తుల వేలం…ఢిల్లీ లాయర్ కొనుగోలు
దాడికి పాల్పడిన వారిని చట్టపరిధిలోకి తీసుకువస్తామని అధికారి మహిద్ ఉద్దీన్ చెప్పారు. ప్రయాణికుల్లాగా వచ్చి రైలును తగులబెట్టారని ఢాకా పోలీసులు అనుమానిస్తున్నారు. శుక్రవారం రాత్రి 9:07 గంటలకు ఎమర్జెన్సీ సర్వీస్ నంబర్ నుంచి తమకు అగ్నిప్రమాద సమాచారం అందిందని ఢాకా రైల్వే పోలీస్ స్టేషన్ సబ్-ఇన్‌స్పెక్టర్ అష్రఫ్ హుస్సేన్ తెలిపారు.