×
Ad

China Train Accident: ఘోర రైలు ప్రమాదం.. 11మంది దుర్మరణం.. వర్కర్స్ పైకి దూసుకెళ్లిన ట్రైన్..

గత పదేళ్ల కాలంలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇదే అతి పెద్దది.

China Train Accident: చైనాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. పట్టాలపై పనులు చేస్తున్న రైల్వే కార్మికులపైకి రైలు దూసుకెళ్లింది. ఈ దుర్ఘటనలో 11 మంది స్పాట్ లోనే చనిపోయారు. మరో ఇద్దరు గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

యున్నాన్ ప్రావిన్స్ లో ఈ ఘోర రైలు ప్రమాదం జరిగింది. భూకంప పరికరాల పరీక్ష కోసం ఉపయోగించే టెస్టింగ్‌ ట్రైన్‌ కున్మింగ్‌లోని లుయోయాంగ్ టౌన్ స్టేషన్‌లో ప్రయాణించింది. వంపుగా ఉన్న రైలు పట్టాల వద్ద కొందరు కార్మికులు పని చేస్తున్నారు. పట్టాలు తప్పిన టెస్టింగ్ ట్రైన్ రైలు ట్రాక్ పై పని చేస్తున్న రైల్వే సిబ్బందిపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో 11 మంది కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాద ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.

కాగా, గత పదేళ్ల కాలంలో చైనాలో జరిగిన రైలు ప్రమాదాల్లో ఇదే అతి పెద్దది. 2011లో చివరిసారిగా భారీ రైలు ప్రమాదం జరిగింది. ఆ దుర్ఘటనలో 40 మంది మరణించారు. 200 మందికి పైగా గాయపడ్డారు.

చైనా రైలు నెట్‌వర్క్ ప్రపంచంలోనే అతి పెద్దది. ఇది 1,60,000 కిలోమీటర్ల (1,00,000 మైళ్ళు) కంటే ఎక్కువ విస్తరించి ఉంది. ఇక, 2021లో వాయువ్య ప్రావిన్స్ లో కార్మికులపైకి రైలు దూసుకెళ్లడంతో 9మంది మరణించారు.

Also Read: హాంగ్‌కాంగ్‌లో ఘోర అగ్నిప్రమాదం ఘటనలో పెరిగిన మృతుల సంఖ్య.. 200 మందికిపైగా మిస్సింగ్..