Truck driver wins lottery : ట్రక్ డ్రైవర్‌ది మామూలు లక్ కాదు.. ప్రతివారం 82,000 .. జీవితానికి సరిపడా డబ్బు.. ఎలా వచ్చింది?

2001 నుంచి అతను లాటరీ కొట్టాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎట్టకేలకు జాక్ పాట్ కొట్టాడు. విన్ ఫర్ లైఫ్ గేమ్ ద్వారా జీవితాంతం వారానికి 82,000 పొందేలా డబ్బులు గెలుపొందాడు. ఎవరతను అనుకుంటున్నారా? ఒక ట్రక్ డ్రైవర్..

Truck driver wins lottery

Lottery winning truck driver :  అదృష్టం మామూలుగా లేకపోతే నక్కను తొక్కాడు అంటారు. ఓ ట్రక్ డ్రైవర్ (truck driver) జీవితకాలానికి సరిపడా లాటరీ గెలిచాడు. విన్ ఫర్ లైఫ్ గేమ్ (win for life game) ద్వారా వారానికి 82,000 చొప్పున జీవితాంతం లాటరీ (lottery) సొమ్ము అందుకోబోతున్నాడు.

US Lottery : మెకానిక్‌కు తగిలిన రూ.328 కోట్లు లాటరీ .. అదృష్టాన్ని ఏప్రిల్ పూల్ అనుకుని ఏం చేశాడంటే..

జీవితంలో అక్కడికి వెళ్లాలి.. ఇది చేయాలి.. అది కొనాలి.. ప్రతి ఒక్కరికి చాలా ఆశలు ఉంటాయి. కానీ సాదా సీదాగా సాగిపోయే జీవితాల్లో అన్నీ ఒకేసారి నెరవేరాలంటే కష్టమైన పని. ఒరెగాన్‌కి (oregon) చెందిన రాబిన్ రీడెల్ (robin riedel) అనే వ్యక్తి ట్రక్ డ్రైవర్‍గా పని చేస్తున్నాడు. ఎంత కష్టపడ్డా అతని కలలు నెరవేరట్లేదు. 2001 నుంచి ఓ లాటరీ కంపెనీ వారి విన్ ఫర్ లైఫ్ అనే గేమ్ ఆడుతున్నాడు. దీని ద్వారా ఎలాగైనా తను అనుకున్నవి సాధించాలనుకున్నాడు. ఎట్టకేలకు మే 8న విన్ ఫర్ లైఫ్ గేమ్ జాక్ పాట్ గెలుచుకున్నాడు. దీంతో అతనికి జీవితాంతం $1,000 లేదా రూ.82,000 కంటే ఎక్కువ మొత్తం ప్రతివారం రివార్డును పొందేందుకు అర్హత సాధించాడు.

Lottery : భార్య సంతోషం కోసం రెండు లాటరీ టికెట్లు కొన్న భర్త .. రూ.16 కోట్లు గెలుచుకున్న జంట

ఇక ఇంత డబ్బు తనకు వస్తుండటంతో రీడెల్ మరో రెండు, మూడేళ్లలో ట్రక్ డ్రైవర్‌గా పని మానేయాలని అనుకుంటున్నాడట. తన ఇంటి రిపేర్లు చేయడానికి, తమ పెళ్లిరోజు ఘనంగా జరుపుకోవడానికి.. అలాగే  సెయింట్ లూసియాలో ( Saint Lucia ) పర్యటించడానికి లాటరీ ద్వారా సంపాదించిన సొమ్మును రీడెల్ వినియోగిస్తాడట. జీవితంలో అదృష్టం తలుపు తట్టడం అంటే ఇదేనేమో. ఈ రకంగా రీడెల్ కష్టాలు తొలగిపోవడంతో పాటు అతని కలలు నెరవేర్చుకునే అవకాశం కూడా పొందాడు.