న్యాయంగా అయితే తనకు ఎప్పుడో నోబెల్ బహుమతి ఇచ్చి ఉండాల్సిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. అసలు నోబెల్ బహుమతి మీకివ్వకపోవడం పెద్ద పొరపాటే అని, ట్రంప్ క్ ఏం తక్కువ అంటూ సోషల్ మీడియా వేదికగా సెటైరికల్ గా కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇవేమైనా భాస్కర్ అవార్డ్ అనుకున్నారా ట్రంప్ గారు అంటూ బ్రహ్మానందం నటించిన ఓ సినిమాలోని కామెడీ సీన్ ను గుర్తుచేస్తున్నారు. బ్రహ్మానందం కామెడీ కన్నా మీ కామీడీనే సూపర్ గా ఉంది ట్రంప్ గారు అంటూ సెటైర్లు పేలుతున్నాయి. ఇండియన్ మూవీస్ లో మీ కామెడీకి మంచి డిమాండ్ ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తో ద్వైపాక్షిక చర్చల సందర్భంగా మంగళవారం(సెప్టెంబర్-25,2015)ట్రంప్ మాట్లాడుతూ…నోబెల్ పురస్కారానికి తాను నిజమైన అర్హుడునని అన్నారు. శాంతి స్థాపన కోసం తాను చాలా పనులు చేశానన్నారు. జ్యూరీ న్యాయంగా గ్రహీతలను ఎంపిక చేస్తే తనకు చాలా విషయాల్లో నోబెల్ పురస్కారం వచ్చేదన్నారు. కానీ వాళ్లు ఆ పని ఎప్పటికీ చేయలేరన్నారు.
అధ్యక్ష పదవిని పొందగానే ఒబామాకు నోబెల్ బహుమతి ఇచ్చారని…అది ఎందుకిచ్చారో ఒబామాకు కూడా తెలియదని ట్రంప్ అన్నారు. ప్రపంచ దేశాల మధ్య సంబంధాలను బలోపేతం చేసే దిశగా పటిష్ఠ చర్యలు చేపట్టినందుకుగాను 2009లో ఒబామాకు నోబెల్ శాంతి బహుమతి లభించిన విషయం తెలిసిందే.