Trump developed : అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు కరోనా నుంచి బయటపడానికి వైద్యులు ఎలాంటి చికిత్స అందించారనే దానిపై రకరకాల వార్తలు వెలువడుతున్నాయి. పిండంలో పెరుగుతున్న కణాలతో చికిత్స చేశారని ప్రచారం జరుగుతోంది. దీనిని ట్రంప్ మద్దతుదారులు ఖండిస్తున్నారు.
కరోనాకు ఇంకా వ్యాక్సిన్ అందుబాటులోకి రాలేదు. శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచడం వల్ల బతుకుతారని వైద్యులు వెల్లడిస్తున్నారు. కరోనా లక్షణాలతో Walter Reed hospital లో నాలుగురోజుల పాటు ట్రంప్.. కొత్త పద్ధతిలో చికిత్స తీసుకున్నారు.
అబార్షన్ చేయించుకున్న పిండంలోని కిడ్నీల నుంచి కణాలు తీసి, ట్రంప్ కు చికిత్స అందించారని తెలుస్తోంది. ఈ కణాలు 8 గ్రాములున్నాయి. పిండాల నుంచి తీసిన కణాలతో ల్యాబలేటరీలో ఉత్పత్తులను తయారు చేస్తుంటారు.
HEK-293T cells గా పిలుస్తుంటారు. అబార్షన్ చట్టాన్ని ఎత్తివేస్తామని అప్పట్లో ట్రంప్ హామీ ఇచ్చారు. అమెరికాలోని పలు రాష్ట్రాల్లో అబార్షన్ మీద కఠిన ఆంక్షలు విధిస్తూ చట్టాలు విధించారు కూడా.
కరోనా సోకిన ట్రంప్‌కు మొత్తం 9 డ్రగ్స్ సాయంతో వేర్వేరు చికిత్సలు జరిగాయి. అధ్యక్షుడి హోదాలో ఆస్పత్రిలోనే అతి తక్కువ సమయంలో వివిధ రకాల 9 ట్రీట్ మెంట్స్ ఇచ్చారు. REGN-COV2 ప్రయోగాత్మక డ్రగ్ ను సింగిల్ డోస్ ఇచ్చారు. వైరస్ తో పోరాడే రోగ నిరోధతను పెంచేందుకు యాంటీబాడీల కోసం ఈ డ్రగ్ వాడుతారు.
శక్తివంతమైన స్టెరాయిడ్ dexamethasone కూడా ట్రంప్ కు చికిత్సలో అందించారు. మొత్తం 9 వేర్వేరు డ్రగ్స్ (కాక్ టయిల్) కలిపి ఇచ్చారు. 1. Dexamethasone, 2. Remdesivir, 3. REGN-COV2, 4. Vitamin D, 5. Melatonin, 6. Oxygen, 7. Zinc, 8. Famotidine, 9. Aspirin తో చికిత్స అందించారు.