Donald Trump
ప్రపంచ దేశాలలోని చాలా మంది విద్యార్థులు అమెరికాలో చదువుకోవాలని కలలు కంటుంటారు. అమెరికాలో అమలు అవుతున్న ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ), కరిక్యులర్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (సీపీటీ) వంటి వర్క్ ప్రోగ్రామ్స్‌లు కూడా అందుకు కారణం.
ఎఫ్-1 వీసాలతో అమెరికాకు వచ్చి చదువుకుంటున్న విద్యార్థులు, వారి విద్య కొనసాగుతున్న సమయంలో, ముగిసిన సమయంలో ఉద్యోగ అనుభవాన్ని పొందటానికి ఓపీటీ, సీపీటీ అనుమతిస్తాయి. 2022-2023 విద్యా సంవత్సరంలో అమెరికాలో దాదాపు 69,000 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో పాల్గొన్నారు.
అయితే, ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆయా విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఓపీటీ, సీపీటీ వంటి వర్క్ ప్రోగ్రామ్స్‌లలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ఖతర్నాక్ స్మార్ట్‌ఫోన్‌పై అతి భారీ డిస్కౌంట్.. లిమిటెడ్ టైమ్ ఆఫర్.. ఇప్పుడే కొనుక్కోండి..
ఓపీటీ, సీపీటీ అంటే?
సీపీటీ
ఓపీటీ, సీపీటీ ప్రోగ్రామ్‌లను అమెరికా ఎందుకు పరిమితం చేయాలని భావిస్తోంది?
అమెరికాలోని ఓపీటీ, సీపీటీ ప్రోగ్రామ్‌లు తమ దేశ కాంగ్రెస్ నుంచి అధికారంగా ఆమోదం పొందలేదని హౌస్ జ్యుడిషియరీ కమిటీ విచారణలో ఇమ్మిగ్రేషన్ నిపుణుడు జెస్సికా ఎమ్ వాఘన్ ఈ ఏడాది జనవరి 22న తెలిపారు.కొన్ని ఇన్‌స్టిట్యూట్‌లు, శిక్షణా కార్యక్రమాలు నకిలీవని, డబ్బును సంపాదించడానికి మాత్రమే ఉన్నాయని చెప్పారు.
ఆయా ఇన్‌స్టిట్యూట్‌లు నకిలీ డిప్లొమాను ఇస్తాయని తెలిపారు. వాటిని వాడి చట్టవిరుద్ధంగా ఉద్యోగాలు పొందడానికి విదేశీయులు ప్రయత్నాలు జరుపుతారని చెప్పారు. ఇటువంటి నకిలీ ఇన్‌స్టిట్యూట్‌లను మూసేయాలని, వాటిని ఆపరేట్ చేయకుండా ఆపడానికి కఠినమైన నియమాలు ఉండాలని అన్నారు. భద్రతాపర ఆందోళనలు కూడా ఉంటాయని నిపుణులు అంటున్నారు.
అమెరికాలో 2023 ఆర్థిక సంవత్సరంలో ఓపీటీ, స్టెమ్ ఓపీటీ, సీపీటీ కింద 539,382 మంది విదేశీ విద్యార్థులు పనిచేస్తున్నారు. ఓపీటీలో 2,76,452 మంది విద్యార్థులు, స్టెమ్ ఓపీటీలో 1,22,101 మంది, సీపీటీలో 1,40,829 మంది విద్యార్థులు ఉన్నారు. దీంతో ఈ ప్రోగ్సామ్‌లలో మార్పులు తీసుకురావాలని అమెరికా భావిస్తోంది.