ఖతర్నాక్‌ స్మార్ట్‌ఫోన్‌పై అతి భారీ డిస్కౌంట్‌.. లిమిటెడ్‌ టైమ్‌ ఆఫర్‌.. ఇప్పుడే కొనుక్కోండి..

ఈ ఆఫర్ కేవలం ఆరు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

ఖతర్నాక్‌ స్మార్ట్‌ఫోన్‌పై అతి భారీ డిస్కౌంట్‌.. లిమిటెడ్‌ టైమ్‌ ఆఫర్‌.. ఇప్పుడే కొనుక్కోండి..

Updated On : February 11, 2025 / 5:16 PM IST

OnePlus 13 discount: భారత్‌లో వన్‌ప్లస్‌ రెడ్ రష్ సేల్‌ను ప్రారంభించింది. ఈ సేల్స్‌ నేటి నుంచి ఈ నెల 16 వరకు కొనసాగుతాయి. వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్, వన్‌ప్లస్ స్టోర్ యాప్, వన్‌ప్లస్ ఎక్స్‌పీరియన్స్ స్టోర్స్, అమెజాన్ ఇండియా, రిలయన్స్ వంటి వాటిల్లో భారీ డిస్కౌంట్‌కు వన్‌ప్లస్‌ ఫోన్లు లభ్యమవుతున్నాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో ఈ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.

డిజిటల్, క్రోమా, విజయ్ సేల్స్, బజాజ్ ఎలక్ట్రానిక్స్‌లోనూ వీటిని విక్రయిస్తున్నారు. వన్‌ప్లస్‌ కంపెనీ ఈ రెడ్ రష్ సేల్‌ ద్వారా డిస్కౌంట్లు, డీల్స్‌, బ్యాంక్‌ ఆఫర్లు అందిస్తోంది. వన్‌ప్లస్ 13, వన్‌ప్లస్ 13 ఆర్, వన్‌ప్లస్ ప్యాడ్ 2, వన్‌ప్లస్ వాచ్ 2 ఆర్ తో పాటు అనేక కొత్త డివైజ్‌లను కూడా డిస్కౌంట్లతో కొనుక్కోవచ్చు. వన్‌ప్లస్ 13 డీల్‌పై కస్టమర్లు చాలా ఆసక్తి కనబర్చుతున్నారు.

రెడ్ రష్ సేల్‌లో భాగంగా కస్టమర్లు వన్‌ప్లస్‌ 13 కొనుగోలుపై రూ.5,000 బ్యాంక్ డిస్కౌంట్ పొందవచ్చు. ఇది ఐసీఐసీఐ బ్యాంక్, వన్‌కార్డ్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి బ్యాంక్ కార్డులపై మాత్రమే ఈ డిస్కౌంట్‌ దక్కుతుంది.

Also Read: బాస్ అంటే నీలా ఉండాలి బాస్.. మూడేళ్లు కంపెనీలో పనిచేస్తే.. రూ.14 కోట్ల బోనస్..

బ్యాంక్ డిస్కౌంట్‌తో వన్‌ప్లస్‌ 13 బేస్‌ 12జీబీ ర్యామ్‌, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 69,999 నుంచి రూ.64,999కి తగ్గుతుంది. అలాగే, 16జీబీ ర్యామ్‌, 512జీబీ స్టోరేజ్ మోడల్‌కు కూడా ఇదే డిస్కౌంట్ వర్తిస్తుంది. దీని ధర రూ.76,999 నుంచి రూ.71,999కి తగ్గుతుంది.

అంతేగాక, మీరు పాత స్మార్ట్‌ఫోన్ ఎక్స్‌చేంజ్‌తో కొత్తది కొనుక్కోవాలని అనుకుంటే బ్యాంక్ ఆఫర్ పైన రూ.7,000 డిస్కౌంట్ వరకు పొందవచ్చు. మీ వద్ద వన్‌ప్లస్ 10 ప్రో ఉంటే దాన్ని ఎక్స్‌చేంజ్‌ చేసుకుంటే రూ.20,810 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు.

దీంతో వన్‌ప్లస్ 13ను రూ.44,189కు కొనుగోలు చేయవచ్చు. మీరు ఇతర బ్రాండ్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా ఎక్స్‌చేంజ్‌ల రూపంలో ఇవ్వవచ్చు. వన్‌ప్లస్ ఫోన్‌ మాత్రమే ఎక్స్‌చేంజ్‌ చేసుకోవాల్సిన అవసరం లేదు.

వన్‌ప్లస్ 13లో డాల్బీ విజన్ సపోర్ట్‌తో 6.82-అంగుళాల 120హెచ్‌జడ్‌ క్యూహెచ్‌డీ+ డిస్ప్లేతో అందుబాటు ఉంది. 6,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యంతో వన్‌ప్లస్ 13 లభ్యమవుతోంది. 100 డబ్ల్యూ వైర్డ్ ఛార్జింగ్, 50డబ్ల్యూ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.