అమెరికాలో ఉద్యోగాలను సృష్టించిన భారతీయ కంపెనీల సీఈఓలతో అగ్రరాజ్యం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమావేశం కానున్నారు. అమెరికాలోని తయారీ రంగంలో పెట్టుబడులు పెట్టిన భారతీయ కంపెనీలకు చెందిన డజన్ల మంది ఎంపిక చేసిన సీఈఓలతో మంగళవారం ట్రంప్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. అమెరికా రాయబారి కెన్నత్ జస్టర్.. భారతీయ సీఈఓలతో భేటీకి వ్యాఖ్యతగా వ్యవహరించనున్నారు. అమెరికాలో తయారీ రంగంలో ఉద్యోగాలు కల్పించిన భారతీయ కంపెనీలపై దృష్టిపెట్టనున్నట్టు సమీప వర్గాలు వెల్లడించాయి.
ట్రంప్ తో సమావేశంలో పాల్గొనే భారతీయ కంపెనీల సీఈఓల్లో మహీంద్రా గ్రూపు చైర్మన్ ఆనంద్ మహీంద్ర, భారతర్ ఫోర్గే మేనేజింగ్ డైరెక్టర్ వ్యవస్థాపకులు, జుబిలంట్ గ్రూపు కో-చైర్మన్ బాబా కల్యాణి, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రసేకరన్ సహా మొత్తం 12 మంది సీఈఓలను ట్రంప్ తో సమావేశానికి ఆహ్వానం లభించింది. ఈ సమావేశంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ ముఖేశ్ అంబానీ కూడా పాల్గొననున్నారు.
అమెరికాలో 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెడతామని హమీ మేరకు ఆనంద్ మహీంద్రా కంపెనీ గణనీయమైన పెట్టుబడులను పెట్టింది. ఇదివరకే 1 బిలియన్ డాలర్ల పెట్టుబడులను మహీంద్ర పెట్టేసింది. గత ఏడాదిలోనే వాషింగ్టన్‌లో కొత్త ఆఫీసు కూడా మహీంద్రా ప్రారంభించింది. వివిధ సిగ్మెంట్లలో కూడా మహీంద్రా పలు సర్వీసులను నడుపుతోంది. భారత్ ఫోర్గే సంస్థ సీఈఓ బాబా కల్యాణీ కూడా గత ఏడాదిలో అమెరికాలో కొత్త ప్లాంట్ ఏర్పాటు కోసం 56 మిలియన్ల డాలర్ల పెట్టుబడి పెట్టారు. ఉత్తర కరోలినా ఆధారిత సంస్థగా ప్రపంచంలోనే అతిపెద్ద ఫోర్జింగ్ యూనిట్ కలిగిన కంపెనీగా ఉంది.
మరోవైపు జుబిలంట్ భారతీయ గ్రూపు సీఈఓ హరి భారతీయ కూడా అమెరికా, కెనడాలో తమ ఎన్నో ఉద్యోగాలను కల్పించారు. అమెరికా-భారత్ ఆర్థిక ఒప్పందాలతో పాటు కీలకమైన ఆర్థిక, వాణిజ్య సమస్యలపై చర్చించే ప్రతినిధి బృందానికి నేతృత్వం వహిస్తోంది. ప్రస్తుతం.. యూఎస్‌లో టాటా గ్రూప్ పలు రంగాల్లో ముందజలో ఉంది. ఇక టీసీఎస్ సహా ఇతర పెద్ద యూఎస్ క్లైంట్లతో కూడా వ్యాపార కార్యాకలాపాలను కొనసాగిస్తోంది. అమెరికా ఫస్ట్ పాలసీ కింద దేశీయ ఉద్యోగాల కల్పనపై ట్రంప్ దృష్టిపెడుతున్నారు.