Russia President Vladimir Putin
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌పై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ట్రంప్ ఓ అనుభవజ్ఞుడైన, తెలివైన రాజకీయవేత్త అని చెప్పారు. అయితే, ఆయనపై రెండుసార్లు హత్యాయత్నం జరిగిన నేపథ్యంలో ఆయన సురక్షితంగా ఉన్నారని తాను భావించడం లేదని అన్నారు.
పుతిన్ తాజాగా కజకిస్థాన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. అమెరికా ఎన్నికల ప్రచార తీరు తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు. ట్రంప్‌కు వ్యతిరేకంగా పోరాడడానికి కొందరు అనాగరిక పద్ధతులను అవలంభించారని తెలిపారు.
రెండుసార్లు ఆయనపై జరిపిన హత్యాయత్నం కూడా ఇటువందిదేనని అన్నారు. అమెరికా చరిత్రలో అనేక దురదృష్టకర ఘటనలు జరిగాయని, అయితే, ట్రంప్ తెలివైనవాడని తాను భావిస్తున్నానని, ఆయన జాగ్రత్తగా ఉంటారని, దీన్ని అర్థం చేసుకుంటారని తాను అనుకుంటున్నానని తెలిపారు.
అమెరికా ఎన్నికల ప్రచారంలో ట్రంప్ కుటుంబం, పిల్లలను రాజకీయ ప్రత్యర్థులు విమర్శించిన తీరుకు తాను మరింత దిగ్భ్రాంతికి గురి అయ్యానని చెప్పారు. అలాంటి ప్రవర్తనను “తిరుగుబాటు”గా పుతిన్ అభివర్ణించారు. రష్యాలో బందిపోట్లు కూడా అలాంటి పద్ధతులను అవలంభించరని చెప్పారు.
Mamata Banerjee: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై మమతా బెనర్జీ కామెంట్స్