Mamata Banerjee: బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై మమతా బెనర్జీ కామెంట్స్
గతంలో చాలా మంది చనిపోయారని, ఇప్పటికీ దారుణాలు జరుగుతూనే ఉన్నాయని మమతా బెనర్జీ అన్నారు.

West Bengal CM Mamata Banerjee
బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పందించారు. ఈ విషయంపై ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఆ ఘటనలు బాధాకరమని, హృదయ విదారకమని చెప్పారు.
గతంలో చాలా మంది చనిపోయారని, ఇప్పటికీ దారుణాలు జరుగుతూనే ఉన్నాయని మమతా బెనర్జీ అన్నారు. ఇటువంటి ఘటనలను సమర్ధించలేమని, ఏ మతంపైనా దాడులను సమర్ధించలేమని తెలిపారు. ఆ దాడులను అరికట్టేలా చేయడంలో తమ పాత్ర చాలా పరిమితంగా ఉంటుందని చెప్పారు.
ఈ విషయంపై భారత ప్రభుత్వం మాట్లాడి చర్యలు తీసుకోవచ్చని మమతా బెనర్జీ అన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రభుత్వ విదేశీ వ్యవహారాల విధానాలకు తాము పూర్తిగా మద్దతు ఇస్తామని చెప్పారు. హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులమైనా అందరూ ఒక్కటేనని, ఇదే తమ సూత్రమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం కూడా ఓ మతం పట్ల ప్రతీకార ధోరణితో వ్యవహరిస్తోందని మమతా బెనర్జీ ఆరోపించారు. ఇది సరికాదని తాము భావిస్తున్నామని, శాంతి, అభివృద్ధికి తాము అండగా ఉన్నామని చెప్పారు. కాగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఇప్పటికే పలువురు భారత నేతలు తమ స్పందనను తెలిపారు.
Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం