Rain Alert: ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం
దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది.

AP Rains
బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర దిశగా ఇలాగే కొనసాగే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ తెలిపింది. ఇవాళ సాయంత్రం బలహీన పడి అల్పపీడనంగా మారవచ్చని వివరించింది.
వాయవ్య దిశలోనే రేపు ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి మధ్య తీరం దాటవచ్చని తెలిపింది. దీంతో, ఆంధ్రప్రదేశ్‌లో నేడు, రేపు వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. దక్షిణ కోస్తాతో పాటు రాయలసీమ జిల్లాల్లో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఇవాళ తిరుపతితో పాటు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వివరిచింది ఐఎండీ. అలాగే, ప్రకాశం, కడప, సత్యసాయి జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.
రేపు తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, అన్నమయ్య, కడప, సత్యసాయి జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం తుపాన్‌గా మారనుంది. ఈ ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో 3 రాష్ట్రాలకు ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. తమిళనాడులో ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి.
Gold Rates: శుభవార్త.. దేశంలో తగ్గిన బంగారం ధరలు