తాజ్ మహల్ తో ట్రంప్ అనుబంధం

  • Publish Date - February 24, 2020 / 09:50 AM IST

భారత పర్యటనలో ఉన్న అగ్రరాజ్యాధినేత ట్రంప్  సోమవారం మధ్యాహ్నం ఆగ్రాలోని తాజ్ మహల్ ను సందర్శిస్తారు.  తాజ్ మహల్ ను ట్రంప్ తొలిసారి సందర్శిచినప్పుడు ఎలాంటి అనుభూతి  కలుగుతుందో తెలీదు కానీ …తాజ్ మహల్ పేరు మాత్రం గతంలో ట్రంప్ కు  భిన్న అనుభవాలనే మిగిల్చింది. 1990 లో న్యూజెర్సీలోని అట్లంటిక్ సిటీలో తాజ్ మాహల్ పేరుతో  క్యాసినోను ట్రంప్ ప్రారంభించారు.

ప్రారంభించిన కొద్ది నెలల్లోనే సంస్ధ దివాలాకు దరఖాస్తు చేసింది. అనంతరం దీన్ని ట్రంప్ ఎంటర్టైన్మెంట్ రిసార్ట్స్ అనే మాతృ సంస్థ కిందకు తీసుకువచ్చి నిర్వహించారు. అప్పటికే అది రెండు సార్లు దివాలా తీసి కష్టాలు మిగిల్చినా ట్రంప్ మాత్రం వ్యక్తగతంగా రెండు చేతులా సంపాదించారు.  ట్రంప్ తాజ్ మహల్ ను 2017 లో హార్డ్ రాక్ కేఫ్ బ్రాండ్ కు  అమ్మేసే సమయానికి డోనాల్డ్ ట్రంప్ కు మాతృ సంస్ధలో వాటాలేదు. 

ఇక  సోమవారం ఫిబ్రవరి 24 విషయానికి వస్తే భారత్ లోని ఆగ్రాలోనిర్మించిన తాజ్ మహల్ ను ట్రంప్ సందర్శించబోతున్నారు. ట్రంప్ పర్యటన సందర్భంగా అధికారులు ఇప్పటికే అక్కడి గార్డెన్ లు , ఫౌంటెన్లను సర్వాంగ సుందరంగా తీర్చి దిద్దారు. ఈ ఆర్భాటపు ఏర్పాట్లు..తాజ్ మహల్ అందాలు ట్రంప్ కు ఎలాంటి అనుభూతులను మిగులు స్తాయి….తన తాజ్ మహల్  క్యాసినోన గుర్తుకు తెచ్చుకుంటారా…….ఎలా తన అనుభూతులను మనతో పంచుకుంటారో వేచి చూడాలి. 

ట్రెండింగ్ వార్తలు